దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలకు దారితీసిన సీబీఐ వర్సెస్ కోల్ కతా పోలీసుల ఘర్షణ వ్యవహారంలో సుప్రీంకోర్టు మమతా బెనర్జీకి షాకిచ్చింది. చిట్ ఫండ్ కుంభకోణాల కేసుల్లో కోల్ కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన ఆదేశాలు మాత్రమే దీదీ సర్కారుకు కాస్త ఊరట కలిగించేలా ఉన్నాయి.
శారదా - రోజ్ వ్యాలీ గ్రూపు కుంభకోణాల కేసుల్లో కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు గాను సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. వారిని కోల్ కతా పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు. దీంతో కలకలం చెలరేగింది. రాజీవ్ కు మద్దతుగా ఆయన ఇంటికి విచ్చేసిన మమత.. సీబీఐ తీరును నిరసిస్తూ ధర్నా ప్రారంభించారు. ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ - సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు సంఘీభావం ప్రకటించడంతో ధర్నా కాస్తా రాజకీయ రగడగా రూపు సంతరించుకుంది.
మరోవైపు - కోల్ కతా పోలీసులు తమకు కేసు విచారణలో సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిట్ ఫండ్ కేసుల్లో గతంలో దర్యాప్తు జరిపిన రాజీవ్ కుమార్ పలు సాక్ష్యాధారాలను నాశనం చేశారని వారు ఆరోపించారు. సీబీఐ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. మమత సర్కారుకు షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
చిట్ ఫండ్స్ కుంభకోణాల కేసుల్లో సాక్ష్యాధారాలు నాశనం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. తటస్థ ప్రదేశమైన మేఘాలయలోని షిల్లాంగ్ లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరించాలని రాజీవ్ కు సూచించింది. అయితే ప్రస్తుతానికి అరెస్టు సహా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగకూడదని సీబీఐకి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు - సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము చిట్ ఫండ్స్ కుంభకోణాల కేసుల్లో చేపట్టిన దర్యాప్తును మమత ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఆ పిటిషన్‌పై వచ్చే నెల 18లోగా సమాధానం చెప్పాలంటూ కోల్‌కతా సీపీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - డీజీపీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది.