తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఐటెం సాంగ్ లో నటించమని బలవంతపెడుతున్నారని ఓ మహిళా న్యాయమూర్తి హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేశారు. అయితే ఈ పరిణామాల క్రమంలో తన విధులకు రాజీనామా చేశారు. ఏడేళ్ల కిందట జరిగిన ఈ వ్యవహరంలో తాజాగా ఆ మహిళా న్యాయమూర్తి తనను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం ఆశ్రయించారు. దీంతో తనకు విధులను అప్పగించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. 2014లో మధ్యప్రదేశ్లో జరిగిన ఈ వ్యవహారం అప్పట్లో సంచలనాన్ని రేపింది. న్యాయస్థాన మహిళకే వేధింపులా అనే కథనాలు వెలువడ్డాయి.
మధ్యప్రదేశ్ హైకోర్టు మహిళా న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా ఐటెం సాంగ్ కు చిందులు వేయాలని బలవంతం పెట్టారని అన్నారు. దీంతో మధ్యప్రదేశ్లో ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’ అనే ట్యాగ్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉదంతంలో మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కింది కోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 2014లో వేధింపులు భరించలేకే తన విధులకు రాజీనామా చేశానని, బలవంతంగా తనపై లైంగిక వేధింపులు చేశారని మహిళా న్యాయమూర్తి సుప్రీంకు విన్నవించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఓ మహిలకు హైకోర్టు జిల్లా జడ్జి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. తనను ఓ ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేయాలని బలవంతం పెట్టారని ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు తనను బదిలీ చేశారని ఆరోపించింది. ఆ తరువాత అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి ఆమె రాజీనామా చేసింది. అయితే ఈ లేఖపై స్పందించిన సుప్రీం కోర్టు ఆరోపించబడ్డ జడ్జికి నోటీసులు అందించారు. అంతేకాకుండా ఈ ఆరోపణపై విచారణ చేసేందుకు రాజ్యసభ తరుపున ఓ ప్యానెల్ ను కూడా నియమించారు.
కొన్ని రోజుల పాటు విచారించిన ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదికను అందించారు. ఇందులో హైకోర్టు జడ్జికి క్లీన్ చీట్ ఇచ్చారు. మహిళా న్యాయమూర్తిని వేధించారనడంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగం అసత్యమని తేల్చారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల తరువాత రాజీనామా చేసిన మహిళా న్యాయమూర్తి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. కానీ ఆమెకు హైకోర్టు అనుమతించలేదు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసినందుకు తిరిగి విధుల్లోకి తీసుకోవడం అసాధ్యమని అన్నారు. అంతేకాకుండా తన రాజీనామాను ఆమోదిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
అయితే సదరు మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గురువారం విచారించిన సుప్రీం మహిళా న్యాయమూర్తిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆమె రాజీనామాను ఆమోదించిన హైకోర్టు పేపర్లను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. దీంతో సదరు మహిళ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే 2014లో జరిగిన ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. న్యాయస్థానంలో ఉండే మహిళకే వేధింపులా..? అనే ప్రచారం జరిగింది. కానీ రాజ్యసభ ప్యానెల్ మాత్రం ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. హైక్టోర్టుకు క్లీన్ చీట్ ఇచ్చారు. దీంతో అసలు విషయం ఏం జరిగిందనేది మాత్రం సస్పెన్ష్ గానే ఉండిపోయింది. కానీ సుప్రీం ఆదేశాలతో మహిళా న్యాయమూర్తి మాత్రం మళ్లీ విధుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.