చారిత్రక తీర్పును వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. చదువుల్లో.. ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించటం సరైనదే అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఆర్థికంగా వెనుక బడిన అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్ల కారణంగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏ విధంగానూ దెబ్బ తీయదని.. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఇంతకీ అసలీ కేసు ఎలా మొదలైంది? అన్న విషయంలోకి వెళితే.. 2019లో మోడీ సర్కారు రాజ్యాంగానికి చేసిన 103వ సవరణే దీనికి కారణం. ఈ సవరణలో భాగంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోకి 15.. 16 అధికరణలను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. 2019 జనవరి 12న రాష్ట్రపతి సంతకం తర్వాత.. ఈ రిజర్వేషన్ల గురించి కేంద్ర న్యాయశాఖప్రకటన చేయటం.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కేసులు వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున కేంద్రానికి సుప్రీం నోటీసులు పంపింది. అదే సమయంలో రిజర్వేషన్ల అమలుపై స్టేకు నిరాకరించింది. 2022 సెప్టెంబరు ఎనిమిదిన ఈ కేసుల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సీజేఐ జస్టిస్ లలిత్ నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబరు 13న వాదనలు మొదలు కాగా.. సెప్టెంబరు 27న ఈ అంశంపై వాదనలు ముగిసి.. తీరపు వాయిదా వేశారు. తాజాగా సోమవారం ఈ కేసులపై తీర్పును ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు అనుకూలంగా.. మరో ఇద్దరు వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొంటూ తీర్పుల్ని ఇచ్చారు. ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లకు పది శాతం ఇవ్వటాన్ని అంగీకరించినట్లైంది.
103వ రాజ్యాంగ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించటం లేదని.. సమసమాజ లక్ష్యాల సాధన దిశగా అందరూ కలిసి ప్రయాణం చేసేలా తీసుకునేందుకు ఈ రిజర్వేషన్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అర్థికంగా.. సామాజికంగా అవకాశాలు పొందలేని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఏ తరగతివారైనా.. వర్గాన్నైనా కలుపుకొని పోయే సాధనంగా అభివర్ణించారు జస్టిస్ మహేశ్వరి.
మరోన్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తన తీర్పును వెల్లడిస్తూ.. ''103వ రాజ్యాంగ సవరణను.. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రయోజనాలు చూకూర్చేందుకు పార్లమెంట్తీసుకున్న నిర్ణయం నిశ్చయాత్మక చర్యగా భావించాలే కానీ వివక్షాపూరితంగా ఉందనే వాదనతో దీన్ని కొట్టేయలేమన్నారు. సామాజిక న్యాయాన్ని పరిరక్షించేందుకు ఇచ్చిన రిజర్వేషన్లను నిరవధికంగా కొనసాగించకూడదు. రిజర్వేషన్లను పదేళ్లు మాత్రమే కల్పించాలన్నది అంబేడ్కర్ వాదన అని.. అది కొనసాగుతూ వస్తోందన్ని జస్టిస్ జేబీ పార్దీవాలా పేర్కొన్నారు. రిజర్వేషన్లు స్వార్థప్రయోజనంగా మారటానికి అంగీకరించకూడదన్నారు.
ఇదిలా ఉంటే.. జస్టిస్ రవీంద్ర భట్ తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లుగా చీఫ్ జస్టిస్ యూయు లలిత్ పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్ర భట్ ఇచ్చిన తీర్పును చూస్తే.. 'మన రాజ్యాంగం వివక్షను అనుమతించదు. ఈ రాజ్యాంగ సవరణ సామాజిక న్యాయానికి.. తద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు మెరుగ్గా ఉన్నారని మనను భ్రమింపజేసే సవరణ ఇది. సామాజికంగా.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఈ కోటా నుంచి తొలగించటం తప్పు. వారికి జరిగిన అన్యాయానికి పరిహారం ఇచ్చే విధానం ఇది. సామాజిక మూలాల ఆధారంగా వారిని ఈ కోటా నుంచి మినహాయించటం సమానత్వానికి విఘాతం కలిగించటమే. సమానత్వ హక్కు కాస్తా.. రిజర్వేషన్లు పొందటమే హక్కుగా మారుతుంది' అని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.