ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన గురించి అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన జరిగిన తరువాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో ఆమె పేరు మీద నిర్భయ చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. ఆ తరువాత ఎవరైనా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారి పై నిర్భయ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా దేశంలో ఆడవాళ్ల పై జరిగే దారుణాలు - అఘాయిత్యాలు మాత్రం తగ్గలేదు.
ఇకపోతే , తాజాగా నిర్భయ కేసులో ప్రధాన నిందుతులుగా ఉన్న నలుగురికి ఉరి శిక్షని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్ సుప్రీం కోర్టు లో క్షమాభిక్ష పటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కొత్త మలుపు తిరిగింది. దోషుల్లో ఒకరైన అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే తప్పుకున్నారు.
అక్షయ్ పిటిషన్ ను తాను వినబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో రివ్యూ పటిషన్ పై విచారణ కొరకు మరో కొత్త బెంచ్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే బాబ్డే కోడలు గతంలో నిర్భయ తరుఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో తన కోడలు వాదించే కేసులో తాను ఎలాంటి తీర్పును ఇవ్వబోనని సీజే స్పష్టం చేశారు. క్షయ్ పిటిషన్ పై వాదనలు వినేందుకు బుధవారం కొత్త బెంచ్ ను ఏర్పాటు చేయనున్నారు. సీజే బాబ్డే స్థానంలో మరో సీనియర్ న్యాయమూర్తిని ధర్మాసనంలోకి తీసుకోనున్నారు. వారి వాదనలు విన్న అనంతరం.. బుధవారమే తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు దోషులు దాఖలు చేసిన రిప్యూ పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ పిటిషన్ కు కూడా కోర్టు కొట్టివేస్తే దోషుల ఉరిశిక్షకు ముహుర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ నలుగురికి ఉరిని వేయడానికి ఇప్పటికే తీహార్ జైలుకు ఇద్దరు తలారిలు వచ్చారని సమాచారం. ఈ పిటిషన్ పై విచారణ పూర్తి కాగానే .. కోర్టు నిర్ణయాన్ని బట్టి వచ్చే రెండు రోజుల్లోనే వారికీ ఉరి శిక్షని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.