ప్రైవేటు ఆస్పత్రుల్లో..వైరస్ ఫీజులపై వివరణ కోరిన సుప్రీం

Update: 2020-06-05 12:10 GMT
వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది.ప్రస్తుతం ఇండియాలో కూడా రోజురోజుకి ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే, వైరస్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు వైరస్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవలు అందుబాటులో లేవని పిటిషనర్ అవిషేక్ గోయెంకా కోర్టుకు తెలిపారు.

వైరస్ పేషేంట్ల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం, కేంద్రం స్పందనను కోరింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వైరస్ పేషేంట్ల చికిత్సపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారించింది.

ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని పొందిన ప్రైవేట్, ఛారిటబుల్ ఆస్పత్రులను కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స చేయమని కోరవచ్చా అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే, వైరస్ రోగులకు ఉచితంగా చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించే చట్టబద్ధమైన అధికారం తమకు లేదని ఇప్పటికే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
Tags:    

Similar News