ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఇతర మతస్థులు వేలం నిర్వహించుకోవచ్చన్న విషయంలో సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని తెలిపింది. అన్య మతస్థులకు దుకాణాల కేటాయింపు నిషేధిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు సుప్రీంకు వెళ్లగా ఇక్కడి వేలంలో అందరూ పాల్గొనవచ్చని గత ఫిబ్రవరిలో కోర్టు ఆదేశాలిచ్చింది.
అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారణ పిటిషన్ ధాఖలైంది. దీంతో మరోసారి తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఏపీ దేవాలయాల్లో ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చాని ఆదేశాలు జారీ చేసింది.
శ్రీశైలంలో ఇతర మతస్థులకు దుకాణాలు కేటాయించవద్దని గతంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడి దుకాణాల వేలం పాటలో ఇతర మతస్థులు పాల్గొననవద్దని బీజేపీతో సహా ఇతర పార్టీలు వేలంను అడ్డుకున్నాయి.
దీంతో వేలం పాటను నిలిపివేశారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంటి నాయకులు సైతం ఓ వీడియోను విడుదల చేసి శ్రీశైలంలో ఇతర మతస్థులకు వేలం పాడడానికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. అయితే వివాదం రాజుకున్న తరువాత ఆలయ ఈవోను బదిలీ చేశారు. అంతేకాకుండా వేలం పాటను నిలిపివేశారు.
ఆ తరువాత షాపులకు వేలం పాటను రద్దు చేసింది. ఈ మేకు దేవదాయ శాఖ కమిషనర్ కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ కొత్త ఈవోగా నియమిస్తూ రెండు సంవత్సరాల కిందట ఉత్తర్వులు జారీ చేసింది.
షాపుల వేలంలో ఇతర మతస్థులు పాల్గొంటున్నారని బీజేపీతో సహా ఇతరులు ఆందోళన చేయడంతో పాటు ‘చలో శ్రీశైలం’ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. అయితే షాపుల వేలం రద్దు చేస్తే సమస్య తీరుతుందని భావించిన ప్రభుత్వ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు షాపుల కేటాయింపును నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ శ్రీశైలం షాపు యజమాలనులు కర్నూలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు షాపు యజమానుల పిటిషన్ ను 2019 సెప్టెంబర్ 27న తోసిపుచ్చింది.
దీంతో షాపు యజమానులు ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. దీంతో హైకోర్టు తీర్పుపై 2020 జనవరి 27న సుప్రీం స్టే విధించింది. అయితే అప్పటి నుంచి జగన్ సర్కార్ ఈ వేలం విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ కొందరు మరోసారి ధిక్కార పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 8న సుప్రీం తుది తీర్పునిచ్చింది.
కాగా ఈ తీర్పును అమలు చేయడం లేదని శుక్రవారం జస్టిస్ చంద్రచూడ్, ఏఎస్ బోపన్న నేతఈత్వంతో ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈమేరకు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సర్కార్ ను ఆదేశించింది.
షాపుల కేటాయింపులో మతం చూడొద్దని, ఇది అడ్డుకాకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. షాపుల వేలంలో అన్ని మతాల వారు పాల్గొనవచ్చని, దేవాలయాల్లో షాపుల లీజులు మతం ఆధారంగా కేటాయింపు తగదని పేర్కొంది.
అయితే ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ వివాదాన్ని వేలం రద్దుతో సమసిపోతుందని అనుకున్న ప్రభుత్వానికి తాజాగా సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో ఎటువైపు వెళ్తుందోనని ఎదురుచూస్తున్నారు.
సుప్రీం ఆదేశాలు జారీ చేస్తే హిందూ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. చేయకపోతే కోర్టు ధిక్కారణ చేసిన వారమవుతారు. దీంతో జగన్ సర్కార్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందని అనుకుంటున్నారు.