గాలి కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Update: 2018-01-22 14:51 GMT
మైనింగ్ కింగ్‌ - కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ పరిమితులను సడలించాలని సుప్రీంకోర్టులో జనార్ధన్‌ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జనార్ధన్‌ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలించడానికి కోర్టు నిరాకరించింది.

ఓఎంసీ కేసులో 2011 - సెప్టెంబర్ 5న జనార్దన్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మూడేండ్ల పాటు జైలు జీవితం గడిపిన జనార్ధన్‌ రెడ్డికి 2015 - జనవరి నెలలో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే గాలి జనార్దన్‌ రెడ్డిపై అటు కర్నాటక - ఇటు ఆంధ్రాలో సీబీఐ - లోకాయుక్త పరిశీలనలో మొత్తం 13 కేసులు ఉన్నాయి. ఓఎంసీ గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు - సరిహద్దుల చెరిపివేత - అటవీ భూముల్లో తవ్వకాలు - అనుమతులు లేకుండా అటవీ భూముల్లో రవాణాలతో పాటు నకిలీ పాస్‌ పోర్ట్‌ కేసు - కర్ణాటకలోని ఏజిఎ మైనింగ్‌ - అలాగే గతంలో లోకాయుక్త సీజ్‌ చేసిన ముడి ఖనిజం అక్రమంగా రవాణా - ఆదాయం పన్ను ఎగవేత - మని లాండరింగ్‌... ఇలాంటి కేసులు ఉన్నాయి.

ఈ కేసులో స‌డ‌లింపు కోరుతూ గాలి జనార్ద‌న్ రెడ్డి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. అయితే, అనంతపురం - బళ్లారి జిల్లాలకు వెళ్లకూడదన్న నిబంధనతో గతంలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు వెళ్లకుండా పాస్‌ పోర్టు స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలను సడలించాలంటూ సోమవారం సుప్రీంకోర్టును గాలి జనార్ధన్‌ రెడ్డి ఆశ్రయించారు. ఆంక్షలు సడలించేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ ను కోర్టు తిరస్కరించింది.
Tags:    

Similar News