అదేం చిత్రమో కానీ.. కోట్లాది మంది ప్రజల్ని తన మాటలతో కన్వీన్స్ చేసే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. మరి.. ఆయన నాయకత్వంలో నడిచే ప్రభుత్వం మాత్రం.. కోర్టు కేసులకు సంబంధించి.. ఎప్పటికప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే దుస్థితి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మొదలు.. సుప్రీంకోర్టు వరకూ పలుసార్లు ఎదురుదెబ్బలు తిన్న విషయం తెలిసిందే.
తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది. విభజన చట్టంలోని సెక్షన్ 89నుసవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది జలాలను పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలంటూ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపింది. బ్రిజేష్ తీర్పుపై అభ్యంతరంవ్యక్తం చేసిన కేసీఆర్ సర్కారు అభ్యంతరాల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పలు అంశాలపై న్యాయస్థానాల్ని ఆశ్రయించే తెలంగాణ సర్కారుకు.. తరచూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది? కోర్టు అంశాల్లో కేసీఆర్ టీం సరిగా హోంవర్క్ చేయటం లేదా? అన్నది సందేహంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/