తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భవితవ్యం రెండు నెలల్లో తేలనుందా..? కోర్టు రెండు నెలల గడువు చెప్పడంతో టీ స్పీకరే చర్యలు తీసుకుంటారా... లేదంటే కోర్టు తలంటే వరకు వెయిట్ చేస్తారా..? తెలంగాణ రాజకీయవర్గాల్లో తాజా పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి.
తెలుగు దేశం పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయకర రావు పిటిషన్ ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఫార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలోనిదని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోలేదని, తమ విచారణ పరిధిలో లేని అంశాన్ని విచారించలేమని పేర్కొంది. రెండు నెలల లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే 14 నెలలైందని టిడిపి తరుపు న్యాయవాది వాదించారు..మరో రెండు నెలలు ఆగండి.. అప్పడు రండి అంటూ విచారణను రెండు నెలల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
కాగా స్పీకర్ పరిధిలో ఇది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా మారిన తరుణంలో సుప్రీం రెండు నెలల గడువు పెట్టడం కీలక పరిణామంగానే భావించాలి. తాము జోక్యం చేసుకోకపోయినా.. రెండు నెలల్లో పరిష్కరించాలని కోరుతున్నామని, అలా జరగకపోతే, అప్పుడు కేసును పరిశీలిస్తామని సుప్రింకోర్టు తెలిపింది. కేసును రెండు నెలల పాటు వాయిదా వేయడంతో.. ఆ తరువాతయినా తలసానికి తిప్పలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. కాగా స్పీకర్ మధుసూదనాచారి ఇకనైనా నిద్రలేచి ఈ రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాల.