ఆ వ్యాపార‌వేత్త 600 కోట్లు క‌ట్ట‌కుంటే జైలే

Update: 2017-01-12 17:43 GMT
స‌హారా చీఫ్ సుబ్ర‌తారాయ్ విష‌యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. స‌హార సంస్థ‌ల ఆర్థిక లావాదేవీల గురించి న‌మోదైన కేసులో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వాద‌న‌లు విన్న త‌ర్వాత త‌న తీర్పును వెల్ల‌డిస్తూ సెబి దగ్గ‌ర ఫిబ్ర‌వ‌రి 6లోపు 600 కోట్లు డిపాజిట్ చేయండి.. లేదా జైలుకెళ్లండి అంటూ సుబ్ర‌తారాయ్‌కి స్ప‌ష్టంచేసింది. డెడ్‌లైన్‌ను పొడిగించాల్సిందిగా ఆయ‌న చేసిన విజ్ఞ‌ప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

నోట్ల ర‌ద్దు, ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నాల‌ను కార‌ణంగా చెబుతూ ఫిబ్ర‌వ‌రి 6 గ‌డువును పెంచాల‌ని సుబ్ర‌తా కోరారు. అయితే ఆ లోపు 600 కోట్లు క‌ట్ట‌క‌పోతే జైలుకెళ్లాల్సిందేన‌ని గ‌త న‌వంబ‌ర్‌లోనే సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది. గ‌తేడాది మేలో త‌ల్లి మ‌ర‌ణించిన్ప‌టి నుంచి సుబ్ర‌తా పెరోల్‌పై ఉన్నారు.  "ఈ కేసుకు కోర్టు చాలా స‌మ‌యం ఇచ్చింది. ఎన్నో అవ‌కాశాలు ఇచ్చింది. 2012లో వివాదం మొద‌లైంది. ఇప్పుడు 2017లో ఉన్నాం. ఇప్ప‌టికీ డ‌బ్బు డిపాజిట్ చేయ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది" అని సుబ్ర‌తారాయ్‌ లాయ‌ర్, కాంగ్రెస్ నేత‌ క‌పిల్ సిబ‌ల్‌కు సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది. అయితే అదే స‌మ‌యంలో లండ‌న్‌లోని త‌మ అకౌంట్‌లో ఉన్న రూ.280 కోట్ల‌ను సెబీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి కోర్టు స‌హారాకు అనుమ‌తిచ్చింది. ఈ కేసు వాద‌న‌లో విజ‌య్ మాల్యా గురించి సిబ‌ల్ చెబుతూ.. ఆయ‌న రూ.6500 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నార‌ని, స‌హారా మాత్రం ఒక్క రూపాయి కూడా బ్యాంకుల నుంచి తీసుకోలేద‌ని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ స‌హారా అంశానికే ప‌రిమితం కావాల‌ని వివ‌రించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News