1045 పేజీల జడ్జిమెంట్ ని అప్‌లోడ్ చేసిన సుప్రీం

Update: 2019-11-09 09:24 GMT
అయోధ్య వివాదాస్పద స్థలం పై దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు లోని  అయుదుగురు న్యాయ మూర్తులు ఏకగ్రీవంగా తీర్పు  వెల్లడించారు. ఈ తీర్పు ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్వయంగా చదివి వినిపించారు. మొత్తం 1045 పేజీల జడ్జిమెంట్ ను సుప్రీం కోర్టు అప్రూవ్ చేసి జడ్జిమెంట్ అప్‌లోడ్ చేశారు.అలాగే ఈ  వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేసి.. ముగ్గురికీ పంచేయాలంటూ గతం లో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది.

విశ్వాసాలు, మతాలు ఆధారం గా కాకుండా పురావస్తు శాఖ వారి రికార్డుల  ఆధారం గా మాత్రమే తీర్పు వెలువరిస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదాస్పద స్థల మైన 2.77 ఎకరాల భూమి రామ జన్మభూమి న్యాస్‌ కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.అలాగే ముస్లింల కు మసీదు నిర్మాణాని కి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఇచ్చిన తీర్పుని అసంతృప్తి గానే స్వాగతించింది  సున్నీ వక్ఫ్ బోర్డ్ . సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. అలాగే ఈ తీర్పు పై దేశంలోని ప్రముఖులు తమ స్పందనని తెలియజేసారు.
Tags:    

Similar News