సర్జికల్స్ స్ట్రైక్ కు రెండేళ్లు..మరో వీడియో వైరల్

Update: 2018-09-28 08:31 GMT
పాకిస్తాన్ ఆర్మీ - ఉగ్రవాద మూకలు.. కలిసి భారత సైన్యంపై దొంగచాటుగా దాడులు చేస్తూ ప్రాణాల తీస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈ దమన కాండకు చెక్ చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దండెత్తింది. భారత సరిహద్దు దాటి భారత సైనికులు వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశారు. దాదాపు 50మంది ఉగ్రవాదులను హతమార్చి తిరిగివచ్చారు. ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగి నేటికి రెండేళ్లు. సైనికుల త్యాగాలకు గుర్తుగా  ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్  మిలటరీ స్టేషన్ లో వేడుకలు నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీయే స్వయంగా హాజరయ్యారు.

మోడీ మిలటరీ శిబిరానికి రావడానికి ముందు స్థానిక కోణార్క్ అమర వీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు.  అనంతరం కోణార్క్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘పరాక్రమ్ పర్వ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆర్మీ ఎగ్జిబిషన్ ను సందర్శించారు.

ప్రధాని హాజరవ్వడంపై ఆర్మీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. భారత సైన్యం శౌర్య, పరాక్రమాలు ప్రదర్శించడానికి ఉద్దేశించిన ఈ ఎగ్జిబిషన్ అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. స్థానిక విద్యార్థులను ఆహ్వానించి భారత్ సర్జికల్ స్ట్రైక్ లో వాడిన ఆయుధాలను చూపించారు. అనంతరం సర్జికల్ స్ట్రైక్ లకు సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్ మరో వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View



Tags:    

Similar News