పాకిస్ధాన్ పై సర్జికల్ స్ట్రైక్

Update: 2021-02-04 17:30 GMT
దాయాది దేశం పాకిస్ధాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అయితే తాజాగా జరిగిన స్ట్రైక్ మనదేశం మిలిటరీ చేసింది కాదు. ఇరాన్ దేశంలోని ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ మెరుపు దాడులు చేశారు. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా పాకిస్ధాన్ ఆధీనంలో ఉన్న ఇద్దరు సైనికులను సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఇరాన్ విడిపించుకోవటం ఇపుడు అంతర్జాతీయంగా సంచలనమైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే 2018, అక్టోబర్లో పాకిస్ధాన్ లోని కీలక ప్రాంతమైన బెలూచిస్ధాన్-ఇరాన్ సరిహద్దులో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య గొడవ జరిగింది. అయితే గొడవ రెండు దేశాల సైనికుల మధ్యే జరిగినా 12 మంది ఇరాన్ సైనికులను పాకిస్ధాన్ కు చెందిన ఉగ్రవాద సంస్ధ జైషే ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన వాళ్ళని తన ఆదీనంలోనే ఉంచుకున్నది.

తర్వాత రెండు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఇరాన్ సైనికులను విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఇరాన్ ఒత్తిడి కారణంగా పాకిస్ధాన్ సైన్యం జైషే సంస్ధ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చింది. దాని ఫలితంగా రెండు విడతల్లో పదిమంది సైనికులను విడుదల చేశారు. అయితే ఇరాన్ ఎంత ప్రయత్నించినా మిగిలిన ఇద్దరు సైనికులను మాత్రం జైషే సంస్ధ విడిడిపెట్టలేదు.

ఎన్నిసార్లు ఇరాన్ దౌత్యపరంగా చర్చించినా ఉపయోగం లేకపోయింది. ఒకవైపు చర్చలంటునే మరోవైపు తన ఇంటెలిజెన్స్ లోని మెరికల్లాంటి వాళ్ళని రంగంలోకి దింపింది. వాళ్ళు పాకిస్ధాన్ అంతా జల్లెడ వేసి గాలించారు. దాని ఫలితంగా బందీలుగా ఉన్న ఇద్దరు సైనికులు ఎక్కడున్నారో కనిపెట్టారు. తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన పక్కా సమాచారం ప్రకారం హఠాత్తుగా 3వ తేదీన ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ తమ సైనికులున్న భవనంపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. కన్నుమూసి తెరిచేంతలోగా తమ సైనికులను విడిపించుకుని అందరు ఇరాన్ కు వెళ్ళిపోయారు. తాజగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విషయం ఇరాన్ అధికారికంగా ప్రకటించేవరకు ప్రపంచానికి తెలీకపోవటం గమనార్హం.




Tags:    

Similar News