దేశ రాజధాని సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలు మాతృ కర్మాగారాలుగా మారిపోతున్నాయి. ఇక్కడ అమ్మతనాన్ని అవుట్ సోర్సింగుకు ఇస్తున్నారు. నోయిడా, గుర్గావ్, లోనీ ప్రాంతాలు ఇప్పుడు సరోగేట్ మదర్స్ కు అడ్డాగా మారిపోయాయి. అమ్మలను అద్దెకు కుదిర్చే కన్సల్టీలు ఇక్కడ వెలశాయి.
నోయిడా పరిసరాల్లో ఇలాంటి సరోగేట్ తల్లుల కోసం ప్రత్యేక కేంద్రాలున్నాయి. ఆ తల్లులు ఇక్కడ చేరి నెలలు నిండగానే పిల్లలను కని తమకు రావాల్సిన డబ్బు తీసుకుని వెళ్లిపోతారు. ప్రస్తుతం సుమారు 25 మంది సరోగేట్ తల్లులు ఇలాంటి కేంద్రాల్లో ఉలన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాల్లో అద్దె ప్రాతిపదికన పిల్లలను కనే తల్లులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో నానా కష్టాలు పడుతున్న నిరుపేద కుటుంబాల్లోని మహిళలు ఈ పనిచేస్తున్నారు. ఆరోగ్య సమస్యల వల్లో... లేదంటే స్వయంగా పిల్లలను కనడం ఇష్టం లేనివారో ఇలాంటి వారిని ఉపయోగించుకుని సంతానభాగ్యం పొందుతున్నారు.
ఇలా అద్దెకు పిల్లలను కనేవారిని గుర్తించి వారికి డబ్బు చెల్లించి తమ పిల్లలను వారి ద్వారా కంటున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో కష్టాలు రాజ్యమేలుతుంటాయి... దేశంలోని వివిధ ప్రాంతాలవారు ఇక్కడుంటారు.. నిరుపేదలు... వారికి ఆర్థిక అవసరాలకు సరిపడా సంపాదన ఉండదు... దీంతో దళారులు వారిని సరోగసీ వైపు నడిపిస్తున్నారు. సరోగేట్ మదర్ కు రెండు నుంచి మూడు లక్షల రూపాయలదాకా చెల్లిస్తారు. ఒకవేళ ఆ అద్దె అమ్మ కనుక కవలలకు జన్మనిస్తే ఆమెకిచ్చే డబ్బు కూడా రెట్టింపులో చెల్లిస్తారు.
ప్రత్యేకంగా కన్సల్టెన్సీలు...
సరోగసీ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో సరోగేట్ కన్సల్టెన్సీలు ఏర్పడ్డాయి. వీరు అద్దె ప్రాతిపదికన పిల్లలను కనేందుకు ఆసక్తి కలిగిన వివాహితలను గుర్తిస్తారు. వారి ఆరోగ్యపరిస్థితి, ఆర్థికపరిస్థితుల గురించి ఆరాతీసే ఇటువంటి కన్సల్టెన్సీలు గుర్గావ్‌కు చెందిన ఉద్యోగ్ విహార్, ఘజియాబాద్‌కు చెందిన లోనీ..వజీరాబాద్, కాపషీరాలోని పారిశ్రామికవాడల ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. పిల్లలను కనేందుకు అమ్మలను ఎంపిక చేసిన దగ్గరనుంచి వారి ఆరోగ్యంగురించి, ట్రీట్ మెంట్ గురించి సంబంధిత కన్సల్టెన్సీఏ బాధ్యత తీసుకుంటుంది. ఇలా పిల్లలను కని ఇచ్చేందుకు వచ్చే మహిళల్లో చాలామంది కుటుంబ సభ్యుల ఆరోగ్యచికిత్స కోసమో లేదా అనారోగ్యంతో బాధ పడుతున్న పిల్లల కోసమో వచ్చినవారే ఎక్కువగా ఉంటున్నారు. మొత్తానికి అవసరం అమ్మతనాన్నే అద్దెకిచ్చేలా చేస్తుందనడానికి ఇక్కడి వ్యాపారమే పెద్ద ఉదాహరణ.