మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయినా బీజేపీ గెలుస్తుందే!

Update: 2018-05-15 07:27 GMT
ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఇమేజ్ ఇప్పుడెలా ఉంది? ఈ ప్ర‌శ్న‌ను రోడ్డు మీద వెళ్లే వారిని మొద‌లు.. ముఖ ప‌రిచ‌యం ఉన్న వారిని అడిగినా చెప్పే స‌మాధానం ఒక‌టే.. లేదండి..మోడీతో క‌ష్ట‌మ‌ని చ‌టుక్కున చెప్పేస్తారు. నాలుగేళ్ల క్రితం మోడీ మీద సామాన్యుల‌కు ఉన్న అంచ‌నాకు ఇప్ప‌టికి సంబంధ‌మే లేదు. ఇదే విష‌యాన్ని తాజాగా నిర్వ‌హించిన ఒక స‌ర్వే వెల్ల‌డించింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి ముందు వెలువ‌డిన ఈ స‌ర్వేలో 2016తో పోలిస్తే తాజా స‌ర్వేలో మోడీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయిన‌ట్లు తేలింది. గ‌డిచిన రెండేళ్ల వ్య‌వ‌ధిలో మోడీ గ్రాఫ్ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 7 శాతం మేర న‌ష్ట‌పోయింద‌ని చెబుతున్నారు. లోక‌ల్ స‌ర్కిల్స్ పేరుతో ఒక పౌర సంస్థ దేశ వ్యాప్తంగా శాంపిల్ స‌ర్వే ఒక‌టి నిర్వ‌హించారు.

ప‌రిమిత సంఖ్య‌తో నిర్వ‌హించిన ఈ స‌ర్వే ప్ర‌కారం క్యాలెండ‌ర్లో ఏడాది గ‌డుస్తున్న కొద్దీ మోడీ గ్రాఫ్ దెబ్బ తింటోంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. 2016లో ఇదే సంస్థ మోడీ గ్రాఫ్ పై దేశ వ్యాప్తంగా స‌ర్వే నిర్వ‌హించింది. అప్పుడు దేశ ప్ర‌జ‌లు మోడీ పాల‌న ప‌ట్ల 64 శాతం సంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లుగా ఈ సంస్థ వెల్ల‌డించింది. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేల్లో అది కాస్తా 57 శాతానికి త‌గ్గిన‌ట్లుగా గుర్తించారు. 2017లో నిర్వ‌హించిన స‌ర్వేలో 61 శాతానికి ప‌డిపోయింది.

దీని ప్ర‌కారం ప్ర‌తి ఏటా నాలుగు శాతం చొప్పున మోడీ త‌న‌ను ఆద‌రించే వారిని కోల్పోతున్నార‌ని చెప్పాలి. రెండేళ్ల క్రితం మోడీ పాల‌న‌పై ఉన్న అసంతృప్తి శాతం 43 కాగా.. తాజాగా అది మ‌రింత పెర‌గ‌టం గ‌మ‌నార్హం. మోడీ పాల‌న విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వారిలో రైతులు.. యువ‌త ఎక్కువ‌గా ఉండ‌టం విశేషం.

నాలుగేళ్ల మోడీ పాల‌న‌లో నిరుద్యోగ స‌మ‌స్య త‌గ్గిందా? అంటే 35 శాతం మాత్ర‌మే సంతృప్తి వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో 54 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మిగిలిన వారు స‌మాధానం చెప్ప‌లేమ‌ని చెప్పారు. కీల‌క‌మైన వ్య‌వ‌సాయ సంక్షోభానికి సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌కు రైతులు స‌మాధానం ఇస్తూ.. త‌మ ప‌రిస్థితి ఏ మాత్రం బాగుప‌డ‌లేద‌ని 47 శాతం మంది చెప్పారు. మోడీ పాల‌న ప‌ట్ల 37 శాతం మంది మాత్ర‌మే సంతృప్తి వ్య‌క్తం చేశారు. నిత్య‌వ‌స‌రాల వ‌స్తు ధ‌ర‌ల విష‌యంలోనూ అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

 నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌ల విష‌యంలో 2016లో 55 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తే.. 2017లో 66 శాతం మంది.. 2018లో 60 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తేలింది. మోడీ హ‌యాంలో మ‌హిళ‌లు.. చిన్నారుల‌పై హింస త‌గ్గిందా? అని ప్ర‌శ్నిస్తే.. 2016లొ 38 శాతం మంది అవున‌ని చెబితే.. 2017లో 28 శాతం.. 2018లో 32 శాతం సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ఇలా.. ప్ర‌తి అంశంలోనూ మోడీ పాల‌న బాగోలేద‌న్న మాట స‌ర్వేల్లో వెల్ల‌డ‌వుతుంటే.. మ‌రోప‌క్క క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం దిశ‌గా దూసుకెళ్ల‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క గెలుపు చూస్తే.. ఓట్ల శాతం త‌క్కువతోనే విజ‌యం సాధించే అదృష్టం బీజేపీకి ద‌క్క‌టంతో ఇప్పుడా పార్టీ విజేత‌గా మారింది. త‌మ వ్య‌తిరేకుల మీద తీవ్ర‌స్థాయిలో దాడి చేయ‌టం.. వారి ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు తాను ప్ర‌ధానిని అన్న విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా అవుట్ టాఫ్ ద బాక్స్ వెళ్లి మ‌రీ తిట్ట‌టం.. విజ‌యం మీద‌నే ల‌క్ష్యం తప్పించి మ‌రి దేని మీదా దృష్టి సారించ‌ట‌మే బీజేపీ విజ‌యానికికార‌ణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News