ఆరోగ్యంగా ఉంటున్నట్లుగా కనిపిస్తూ.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురై.. ఆ వెంటనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినట్లుగా మారారు దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె మరణం దేశ ప్రజల్ని విపరీతంగా కలిచివేసింది. విదేశాంగ మంత్రిగా ఉన్న వేళ.. ఆమె పనితీరు దేశ ప్రజల్ని ఆకట్టుకోవటమే కాదు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ గౌరవాన్ని భారీగా పెంచారని చెప్పాలి.
అత్యున్నత స్థానంలో ఉన్న సుష్మా.. తన చివరి కోరికను తీర్చుకోలేకపోయారన్న మాట వినిపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో వాదించి.. కేసును గెలిచినందుకు హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన రూపాయి ఫీజు ఆమె తీర్చకుండానే వెళ్లిపోయారు.
తన తల్లి చివరి కోర్కెను తాజాగా తీర్చారు సుష్మా కుమార్తె బన్సూరి. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషణ్ తరఫున హరీశ్ వాదించటం.. గెలవటం తెలిసిందే. సుష్మ చనిపోవటానికి సరిగ్గా గంట ముందు హరీశ్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూపాయి తీసుకెళ్లండన్నారు. కానీ.. అంతలోనే ఆమె మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె బన్సూరి.. తన తల్లి చివరి కోర్కెను తీర్చారు. హరీశ్ సాల్వేకు రూపాయి ఫీజును ఆమె చెల్లించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్వీట్ తో లోకానికి తెలియజేశారు. అమ్మా.. నీ చివరి కోరికను నెరవేర్చానంటూ ఆమె చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటోంది.