బీజేపీ సిద్ధాంతాలను బలంగా నమ్మి పాటించడమే కాకుండా... సేవాగుణం ఉట్టిపడ్డ నాయకుల్లోని సుష్మాస్వరాజ్ ప్రముఖమైన వ్యక్తి. సీనియర్ నాయకురాలు అయినప్పటికీ మారుతున్న కాలానికి తగినట్లు ఆమె సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. చక్కటి పఠనాసక్తి ఉన్న సుష్మా తన నడవడిక కారణంగా ఓ జంటకు గొప్పవరాన్ని అందించారు.
హర్యానాలోని ప్రేమ జంటకు చెందిన ఇబ్బందికరమైన పరిస్థితిని ఓ హిందీ పత్రిక ప్రచురించింది. టిను అనే భారతీయుడికి కజికిస్తాన్ కు చెందిన జహాన అనే మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం అయింది. సౌదీ అరేబియాకు వెళ్లి ఆమెను కలిసిన టిను పెళ్లి చేసుకుంటానని జహానా చెప్పిన ప్రతిపాదనను అంగీకరించాడు. అయితే ఓ షరతు పెట్టాడు. తనతోపాటే ఉండిపోవాలని సొంత దేశం ఇండియాకు వచ్చేయాలని కోరాడు. దానికి అంగీకరించిన జహాన టూరిస్టు వీసాకింద గత ఏడాది జూన్ నెలలో భారత్ కు వచ్చి వివాహం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె వీసా గడువు ముగిసిపోయింది. ఈ క్రమంలో వీసా పొందేందుకు ఆ భార్యాభర్తలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీరి ఇబ్బందిని ఆ హిందీ పత్రిక ప్రచురించింది.
ఆ దంపతుల అదృష్టవశాత్తు సదరు వార్తను సుష్మాస్వరాజ్ చదివారు. యథాలాపంగా ఆ వార్తను చదివి వదిలేయకుండా మానవతా హృదయంతో స్పందించారు. ఆ కజకిస్థాన్ యువతిని భారతీయ కోడలుగా పిలుస్తూ... వీసా ప్రయత్నానికి తాను సహకరిస్తానని ప్రకటించారు. వీసా దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆ విజ్ఞాపన పత్రాన్ని తనకు పంపించాలని కోరారు. సుష్మా స్వరాజ్ విశాల హృదయానికి పలువురు ప్రశంసిస్తున్నారు.