ఫేస్ బుక్ - ట్విటర్ వంటి యాప్స్ ను ప్రజలు ఇన్ ఫర్మేషన్ షేరింగ్ కోసమే ఎక్కువగా వాడుతున్నారు. కానీ.. రాజకీయ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం దీన్ని వాడుకోవచ్చు అని అనేక సందర్భాల్లో నిరూపించిన ఘనత సుష్మా స్వరాజ్ ది. బహుశా ప్రపంచంలో ఇంకే నేత కూడా ట్విటర్ ను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంతగా వాడుకోలేదేమో. సుష్మా స్వరాజ్ ట్విటర్ వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించిన తీరు చూస్తే.. ఇంత చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు ఎవరైనా.
ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగారూ.. సాయం చేయండి.. అని ట్వీట్ చేయగానే వెంటనే స్పందించే వారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, చివరకు చంద్రమండలంలో ఉన్నా సాయం చేస్తాననేవారు ఆమె. అలా ఆమె ట్విట్టర్ వేదికగా సాయం అందించిన కొన్ని ప్రధాన సమస్యలు ఇవీ..
– 2015లో ఇరాక్ లో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ చిక్కుకున్న 168 మంది భారతీయులను సురక్షితంగా భారత్ కు చేర్చి అందరి మన్ననలు అందుకున్నారు. తొలి విడతగా 140 మందిని.. మరో 28 మందిని బాస్రా నుంచి ప్రత్యేక శ్రద్ధతో భారత్ కు తీసుకొచ్చారు.
– 2016లో ప్రశ్ను సింఘాల్ అనే వ్యక్తి తన తమ్ముడు అంకిత్ దోహా విమానాశ్రయంలో చిక్కుకున్నాడని సుష్మా స్వరాజ్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి అంకిత్ ను సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు.
-2015లో బెర్లిన్ లో ఓ భారతీయ మహిళ తన పాస్ పోర్టు - పర్సు పోగొట్టుకుంది. సాయం చేయాల్సిందిగా అర్థించింది. వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్ - బెర్లిన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి అగ్రతాకు తన వంతు సాయం అందించారు. త్రిపాఠి - మురుగన్ కాల్ చేసి ఆమెను ఆదుకున్నారు.
– యెమిన్ కు చెందిన ఓ మహిళ సభాసవేష్ - భారతీయుడిని పెళ్లి చేసుకుంది. ఆమె తన 8 నెలల కూతురు ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. తన కూతురిని సురక్షితంగా కాపాడాలని కోరింది. దీనికి స్పందించిన సుష్మా.. అన్ని విధాలుగా సాయం అందించింది. ఆదుకోవడం తన కర్తవ్యం అని - సంతోషంగా ఉండాల్సిందిగా ఆమె ఆకాంక్షించారు.
– యూఏఈలో ట్రాఫికింగ్ లో చిక్కుకున్న దేవ్ తంబోలి సోదరిని సుష్మా స్వరాజ్ కాపాడారు. ఉద్యోగం కోసం వెళ్లి చిక్కుకుపోయిందంటూ ఓ నెంబర్ ను ఆమె పోస్టు చేసింది. అప్పుడే యూఈఏ రాయబారితో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. దేవ్ తంబోలిని నెంబర్ ను వారికి అందజేసి సాయం చేసి ఆదుకున్నారు.
– రిషికేష్ లో డచ్ కు చెందిన సుజాన్నే లుగనోస్ తప్పిపోయింది. ఆమె తరపు వాళ్లు సుష్మా సాయం కోరడంతో స్పందించారు. స్థానిక పోలీసులతో విచారణ జరిపించి వారి ఆచూకీని కనుగోని దేశ ప్రతిష్టతను విదేశాలకు చాటి చెప్పారు సుష్మా స్వరాజ్.