హాజీపూర్ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. శ్రావణి అనే పదోతరగతి విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి బావిలో పూడ్చేయడం కలకలం రేపింది. నిన్ననే మనీషా అనే మరో యువతి మృతదేహం కూడా అదే బావిలో కనిపించింది. చుట్టుపక్కల గ్రామానికి చెందిన మరో బాలిక కూడా నాలుగేళ్ల క్రితం ఇదే రీతిన అదృష్యమైంది.. ఇలా ముగ్గురు విద్యార్థినులను హత్య చేసింది శ్రీనివాసరెడ్డి అనే హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో కామ పిశాచి కిల్లర్ అని పోలీసుల విచారణలో తేలింది. శ్రీనివాసరెడ్డి ఈ మూడు హత్యలు చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్టు సమాచారం.
దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు హాజీపూర్ లోని సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఇంటిని తగులబెట్టి ధ్వంసం చేశారు. అయితే హాజీపూర్ లో ముగ్గురు విద్యార్థినులను హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి గురించి ఆ గ్రామస్థులు కథలు కథలుగా చెబుతారు. ముగ్గురిని దారునంగా అత్యాచారం చేసి చంపి మరీ గ్రామస్థుల సమక్షంలోనే మంచిగా తిరిగిన శ్రీనివాసరెడ్డి సైకో మెంటాల్టీపై గ్రామస్థులు వివరిస్తున్నారు.
*సైకో శ్రీనివాస్ రెడ్డి మనస్తత్వమే క్రూరం..
శ్రీనివాస్ రెడ్డి చిన్పప్పటి నుంచి విభిన్న మనస్తత్వం కలవాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని ..చిన్నతనం నుంచే దొంగతనాలు చేసే అలవాటు ఉందని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే దొంగతనాలు చేసిన సమయంలో కుటుంబసభ్యులు శ్రీనివాస్ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదని ఇంత వరకు వచ్చేది కాదంటున్నారు..వాళ్లు వెనకేసుకొచ్చి అతడిని క్రూయల్ గా మార్చారని ఆరోపిస్తున్నారు.
*అడవుల్లో ఒంటరిగా శ్రీనివాస్ రెడ్డి..
గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి తక్కువగా ఉండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. కీసరలో మెకానిక్ గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. గ్రామంలో ఎప్పుడైనా ఉంటే ఒంటరిగా ఊరంతా తిరిగేవాడని చెబుతున్నారు. నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు.
*తాగి జల్సాలతో ఘాతుకాలు..
ఇక శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన వ్యవసాయ బావుల వద్ద కూడా శ్రీనివాస్ రెడ్డి అప్పుడప్పుడూ సంచరించేవాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇటీవలే శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు భూమిని విక్రయించారని.. ఆ డబ్బు రావడంతోనే మద్యం తాగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడని.. ఇలా రాత్రిపూట కనిపించిన శ్రావణి, మనీషాలను అత్యాచారం చేసి చంపి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
*డ్రగ్స్ మత్తులో దారుణాలు..
శ్రీనివాస్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు కూడా ఉందని అతడి స్నేహితులు చెబుతున్నారు. అయితే వాటిని తమకు కనిపించనీయకుండా వాడేవాడని చెబుతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఓరగా చూస్తూ కనిపించేవాడంటున్నారు.. ఈ కోవలోనే లిఫ్ట్ అడిగిన శ్రావణి, మనీషాలను అత్యాచారం చేసి అనంతరం చంపి ఉంటాడని భావిస్తున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.