ఏపీలో జరిగిన పురపోరులో అధికారపార్టీ వైసీపీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. పలు కార్పొరేషన్లతో పాటు.. విశాఖ కార్పొరేషన్ ను సైతం అధికార పార్టీ సొంతం చేసుకుంది. విశాఖ నగరానికి మేయర్ గా గొలగాని వెంకట హరికుమారి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. విశాఖ వైసీపీ మహిళా కార్పొరేటర్ ఒకను మరణించటం షాకింగ్ గా మారింది.
ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 61వ వార్డు నుంచి సూర్యకుమారి విజయం సాధించారు. ఆదివారం రాత్రి ఆమె మరణించినట్లుగా వార్త బయటకు రావటంతో షాక్ తిన్నారు.
ఎన్నికల్లో గెలిచి వారం కూడా కాక ముందే మరణించటాన్నివైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సూర్యకుమారి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నట్లు చెబుతున్నా.. పోలీసులు మాత్రంపెదవి విప్పటం లేదు. ఈ అనుమానాస్పద మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అసలేమైందన్న విషయం బయటకు రావాల్సి ఉంది.