అసెంబ్లీ లో జరిగిన రచ్చను ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జనాల మధ్యకు తీసుకెళుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల పట్ల అధికార తెలుగుదేశం పార్టీ వైఖరి సరిగా లేదని అంటూ వైకాపా వాళ్లు దిష్టిబొమ్మల దహనం వరకూ వెళ్లారు!
ఈ మేరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేయడం విశేషం. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైకాపా ఎమ్మెల్యే రోజా ను 'ఆంటీ'గా సంబోధించడం.. పాతరేస్తా.. అంటూ వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించడంపై వైకాపా కార్యకర్తలు.. విద్యార్థి నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. మొత్తానికి అసెంబ్లీలో జరిగిన రచ్చ గురించి జనాల మధ్యకు వెళ్లి దిష్టిబొమ్మలు దహనం చేయడం వంటి చర్యల ద్వారా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని గట్టిగానే పట్టుకొన్నట్టుగా ఉన్నారు.
ఇంత వరకూ అసెంబ్లీ గొడవలు అసెంబ్లీతోనే సమసిపోయేవి.. మీడియాలో కథనాల వరకూ మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే అసెంబ్లీలో వాదోపవాదాలు వివాదాలుగా మారడంతో ఇప్పుడు కార్యకర్తలు రెచ్చిపోయి దిష్టిబొమ్మలు దహనం చేసేంత వరకూ వెళ్లింది పరిస్థితి. మరి ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యులు ఢీ అంటే ఢీ అంటూ రెచ్చిపోతున్న ఈ తరుణంలో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి!