ఏ మీడియా అయినా వాణిజ్య ప్రకటనలు లేనిది మనుగడ సాగించదు. ఇక టీవీ అయితే ఒక్క క్షణం కూడా చాలా విలువైనది. టాప్ చానల్స్ అయితే ప్రకటనలకు భారీ ధరలు నిర్ణయిస్తాయి. వ్యూయర్స్ షిప్ బాగుంటే వాళ్లే అధిక ధరకు చెల్లిస్తుంటారు. ఇది వారికి ఆదాయం తెస్తుండగా వీక్షకులకు మాత్రం చిరాగ్గా ఉంటాయి. అలాంటి ప్రకటనలను తిరుమల తిరుపతి దేవస్థానం నిషేధం విధించింది. ఆ నిషేధం ఎక్కడో కాదు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ)లో. ఈ చానల్ నిర్వహణపై శుక్రవారం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై ప్రకటనలు లేని (యాడ్ ఫ్రీ) ఛానల్‌గా ఎస్వీబీసీ రానుందని అధికారులు ప్రకటించారు. ఆదాయ వనరుల కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకటనలు లేకపోవడంతో ఈ ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని టీటీడీ తెలిపింది. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలను భక్తులకు అందించడానికి తాము ప్రయత్నం చేస్తామని, లాభాపేక్ష లేకుండా పనిచేస్తామని స్పష్టం చేసింది. అయితే చానల్ నిర్వహణకు ఇప్పటికే భక్తులు రూ.25 లక్షలు విరాళంగా అందజేసినట్లు టీటీడీ పేర్కొంది.