స్వామి కి అర్థమైంది.. మోడీ షాలకు అర్థం కాదెందుకు?

Update: 2019-11-11 05:03 GMT
జీడిపాకం మాదిరి మారిన మహా రాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మహా రాష్ట్ర గవర్నర్ కోరటం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు లేదన్న సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు కమల నాథులు. ఇలాంటి వేళ.. గవర్నర్ తన తర్వాతి ప్రాధాన్యతను శివ సేనకు ఇచ్చారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి వేళ.. సీన్లోకి వచ్చారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. సంచలన వ్యాఖ్యల కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తనకు అవకాశం ఇస్తే.. బీజేపీ - శివసేన ల మధ్యన సయోద్య నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఈ రెండు పార్టీలు కూటమి గా ఉండటం చాలా అవసరమన్న ఆయన.. సీఎం పదవి గురించి బీజేపీ ఆలోచించొద్దని.. రెండు పార్టీలు కలిసి ఉండటం అత్యవసరమన్నారు.

బీజేపీ అధి నాయకత్వం ఓకే అంటే తాను ఉద్దవ్ తో మాట్లాడేందుకు సిద్ధమన్న ఆయన.. ఒకవేళ సంకీర్ణం విచ్ఛిన్నమైతే మూల సిద్ధాంతమైన హిందుత్వ కు ప్రమాదం ఏర్పడుతుందని స్వామి చెప్పారు. మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి తమకు అండగా నిలవాలని.. 50-50 పవర్ ను పంచుకోవాలన్న వాదనను వినిపిస్తున్న శివసేనను పట్టించు కోని కమల నాథులు.. స్వామి మాటలైనా చెవి కెక్కుతాయేమో చూడాలి.
Tags:    

Similar News