తెలుగు టీవీ మీడియాకు ఈరోజు అనుకోని ఝలక్ తగిలింది. హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్న ఒక స్వామీజీ బృందం ఈరోజు హైదరాబాదులో గవర్నర్ ను కలవడానికి వచ్చింది. అంతకుముందు ఆ స్వామీజీని మీడియా కలిసి మాట్లాడమని కోరింది. అంతే... ఆ స్వామీజీ వారిపై ఇంతెత్తున లేచారు. ఎందుకు మా వద్దకు వచ్చారు. మీ మద్దతేం మాకు అవసరం లేదు. పోండి.. ఆ శ్రీరెడ్డి, కత్తి మహేష్ వార్తలు కవర్ చేసుకోపోవండి, మీదంతా యెల్లో జర్నలిజం. టీఆర్పీ రేటింగులు వస్తే చాలు. మావార్తలు మీకెందుకు చెప్పండి? అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
కొందరు మీడియా రిపోర్టర్లు అలాంటిదేమీ ఉండదు సామీ అని అనునయించబోతే... మీకు అసలు ప్రజలు సమస్యలే పట్టవు. మీరు టీఆర్పీ రేటింగుల కోసం కాదు పోరాడుతున్నది అంటే... మీ యాజమాన్యాలతో ఈ యాత్ర మొత్తం కవర్ చేస్తామని చెప్పించు మరి అంటూ సవాలు విసిరారు. హిందు ధర్మానికి వెన్నుపోటు పొడిచేవారు మీరు. మీరే కాదు. ఇండియా మీడియా మొత్తం హిందూ దర్మానికి వ్యతిరేకమే అంటూ ఆయన మండిపడ్డారు.
పనికిమాలిన వారిని భుజాన పెట్టుకుని గంటలు గంటలు ప్రోగ్రాంలు చేస్తారు. ఏం కావాలి మీకు ఇక్కడ. మీ మద్దతు అవసరం లేదు పొండి. ఏది జనం చూస్తారో - ఎక్కడ పది మంది ఉంటారో ఆ వార్త మీకు చాలు. ఈ మాత్రం దానికి మీడియా అని అనిపించుకోవడం ఎందుకు. టీఆర్పీల కోసం పనిచేసేది మీడియా కాదు... ప్రజల అన్ని సమస్యలను పట్టించుకునేదే మీడియా అంటూ భారీ క్లాస్ పీకారాయన. మేము ధర్మపోరాటం కోసం వచ్చాం. మీరేదో మీడియాలో చూపిస్తారని రాలేదు అంటూ కుండబద్ధలు కొట్టినట్లు మొహం మీదే చెప్పారు. ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము వచ్చాం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు దయచేసి మా వద్దకు రావొద్దని ఆయన తేల్చేసేసరికి మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. నిజాయితీగా మాట్లాడాలంటే చచ్చిపోయిన శవాల మీద పేలాలు ఏరుకుంటోంది మీడియా అంటూ ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. మీలో నిజాయితీ లేదు అని స్పష్టం చేశారు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View