చెమటలు పట్టిస్తున్న అమెరికా.. కెనడా టెంపరేచర్.. వెయేళ్లకు ఒకసారి

Update: 2021-07-01 09:30 GMT
మన దేశం గురించి కాసేపు పక్కన పెడదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత? ఎవరికి వారు వారి అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక రోజు 50 డిగ్రీలకు చేరుకోవటం.. ఆ రెండు.. మూడు రోజులు చుక్కలు కనిపించాయి. కట్ చేస్తే.. ఆ తర్వాత 45 డిగ్రీలకు పరిమితం కావటమే తప్పించి.. అంతకు మించిన అదరగొట్టేసిన సూరీడి ఉదంతాలు పెద్దగా లేవని చెప్పాలి.

మనతో పోలిస్తే.. కూల్ కూల్ గా ఉండే అమెరికా.. కెనడాలోని చాలా ప్రాంతాలు ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. సూరీడు దెబ్బకు ఉడికిపోతున్నాయి. దాదాపు వెయేళ్లకు ఒకసారి నమోదయ్యే గరిష్ఠ ఉష్ణోగ్రతలు తాజాగా ఆ రెండు దేశాల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిని తట్టుకోలేని వారు అపసోపాలు పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎండ తీవ్రతను తట్టుకోలేక బ్రిటిష్ కొలంబియా పశ్చిమ తీరంలో కనీసం 233 మంది మరణించినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం అక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రత49.5డిగ్రీలకు చేరుకుంది. కెనడాలోని లైటన్ అనే ప్రాంతంలో మంగళవారం ఏకంగా 49.5 డిగ్రీలు నమోదు కావటంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఇలాంటి పరిస్థితి వెయ్యేళ్లకు ఒకసారి వస్తుందని.. తాజాగా అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడున్న వేడి.. మరో వారం రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేడి తీవ్రతకు ముందు వరకు ఆ రెండు దేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత పాతిక డిగ్రీలకు మించింది లేదు. అలాంటిది ఒక్కసారి 50 డిగ్రీలకు చేరుకోవటం అంటే మాటలు కాదు.
Tags:    

Similar News