పాక్ ఎంపీ భర్త పై భార్య సంచలన ఆరోపణలు.. దెయ్యం కంటే దారుణం

Update: 2022-05-11 03:15 GMT
ఇమ్రాన్ ఖాన్ పార్టీ (తహరీక్ ఏ ఇన్సాఫ్)కి చెందిన పాక్ ఎంపీ కమ్ టీవీ ప్రముఖుడిగా పేరున్న అమిర్ లియాకత్ మూడో పెళ్లి ముగిసినట్లే. పెళ్లి చేసుకున్న కొద్ది నెలల వ్యవధిలోనే ఆయనపై ఆయన సతీమణి సయిదా దానియా షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్ ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అతనితో కలిసి బతకటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. విడాకులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. విడిపోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. అతను దెయ్యం కంటే దారునమంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

గత ఫిబ్రవరిలో తన కంటే దాదాపు 31 ఏళ్లు చిన్నదైన సయిదా దానియా షాను అమిర్ లియాకత్ పెళ్లాడారు. ఆయనకు అది మూడో పెళ్లి. తమ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. తన భర్తతో విడిపోతున్నట్లుగా పేర్కొన్న ఆమె.. కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

తనపై అమిర్ చాలా క్రూరంగా ప్రవర్తించేవాడని.. తనను మూడేసి రోజులు గదిలో పెట్టి తాళం వేసే వారని.. ఆ సందర్భంలో తిండి కూడా పెట్టేవారు కాదంటూ తనకు ఎదురైన నరకాన్ని వెల్లడించారు.

కొన్నిసార్లు కొట్టేవారని..ఒకసారి గొంతు కూడా నొక్కేసినట్లు ఆమె చెప్పారు. పిస్టల్ తో బెదిరించినట్లుగా ఆరోపించారు.తనకు.. తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు తన భర్త అమిర్ కారణంగా స్పష్టం చేశారు. తనకు విడాకులు మంజూరు చేయటంతో పాటు తన పోషణ కోసం ఖర్చులు ఇచ్చేలా చూడాలన్నారు. తనను దారుణంగా వేధించటమే కాదు.. అభ్యంతరకర వీడియోలు తీసినట్లుగా చెప్పారు.

నెలకు రూ.లక్ష మొయింటైన్స్ తో పాటు ఒక ఇల్లు.. కారుతో సహా మొత్తం రూ.11 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు. 'ఆయన దెయ్యం కంటే దారుణంగా వ్యవహరించేవారు' అని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై పాక్ సోషల్ మీడియా రెండుగా చీలింది. ఆమెకు అండగా నిలుస్తున్నట్లు పలువురు పేర్కొంటే.. మరికొందరు మాత్రం అతడి డబ్బు కోసమే పెళ్లి చేసుకొని ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. మరి.. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై జూన్7న విచారణ జరగనుంది.
Tags:    

Similar News