కేసీఆర్ కు టీ కాంగ్రెస్ నేతల ఛాలెంజ్!

Update: 2016-10-14 04:44 GMT
ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే విపక్షాలకు ఏడెనిది సీట్లు కూడా రావని.. సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని.. ఈ విషయం  తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయినట్లుగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అగ్గి ఫైర్ అయ్యారు. దసరా రోజున ఫాంహౌస్ లో తన పార్టీకి చెందిన ముస్లిం నేతల్ని కూర్చోబెట్టుకొని ముస్లిం నేతలకు బంగారు భవిష్యత్తు చూపిస్తానని చెప్పటం ముస్లిం మైనార్టీలను మోసం చేయటంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా గాల్లో మేడలు కట్టే ముఖ్యమంత్రి కేసీఆర్.. పగల్భాలతో కాలం గడిపేస్తున్నరంటూ ఫైర్ అయిన వారు.. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంను.. ‘‘దోఖేబాజ్ ముఖ్యమంత్రి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో మాట్లాడిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కారుపై వివిధ అంశాలపై ప్రశ్నలు వేయటమే కాదు.. ఒక ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్షాలకు ఏడెనిమిది సీట్లు మాత్రమే వస్తాయంటూ కేసీఆర్ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే తన పార్టీలో చేర్చుకున్న పాతికమంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వారందరితో ఉపఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు.

ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్న నలుగురు ఎంపీలు.. పాతిక మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఎన్నికల బరిలో దిగితే.. సగం సీట్లు కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరి నోటి నుంచైనా ‘‘దమ్ము.. రాజీనామా’’ లాంటి పదాలు వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యే కేసీఆర్..తాజా సవాలుకు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇక.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంధించిన ప్రశ్నల్ని చూస్తే..

= రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే.. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయటం లేదు?

= సిద్దిపేట జిల్లాకు రూ.100 కోట్లు ఇస్తానన్న సీఎం మిగిలిన జిల్లాలకు ఎందుకు ఇవ్వరు?

= కరీంనగర్ కు మెడికల్ కాలేజీ ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పటివరకూ ఇవ్వలేదు? ఇప్పుడేమో సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అంటున్నారు. ఏది నిజం?

= రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పులు ఎందుకు చేస్తుంది?

= సంపన్న రాష్ట్రంగా చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కారు.. రైతులకు కరువు నిధులు ఎందుకు ఇవ్వటం లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News