తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు. దీంతో వరుస అపజయాలను మూటగట్టుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ కు - అధికార పార్టీ ఎత్తుగడలకు తలవంచి మరో స్థానాన్ని కోల్పోక తప్పలేదు. ఈ ఓటమితో తమకు కష్టకాలం ఖాయంగా ఉందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. త్వరలో ఢిల్లీ పర్యటనల ఉండనున్న నేపథ్యంలో ఏం సమాధానం ఇవ్వాలో తెలియకుండా ఉందనేది కాంగ్రెస్ అగ్రనేతల పరిస్థితి అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో చావుదప్పి కన్నులొట్టబోయిన చందంగా ఆనాటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సారథ్యంలో 119 స్థానాలకు పోటీ చేసి - కేవలం 22 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పొన్నాల సైతం ఓటమి చెందడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కున్నారు. దీంతో పార్టీ పటిష్టత కోసం నాయకత్వాన్ని మార్చాలని కొంతమంది ముఖ్య నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో పొన్నాలను తప్పించి, నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. అయితే దురదృష్ట మేంటోగానీ ఆయన పదవీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి పార్టీలోని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు ఒక్కొరొక్కరుగా టీఆర్ ఎస్ లోకి వలసగట్టారు. దీంతో 6గురు ఎమ్మెల్యేలతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు దివంగతులయిన మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ - ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి - రాంరెడ్డి వెంకట్ రెడ్డి స్థానాలను సైతం ఉప ఎన్నికలల్లో కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ ఎమ్మెల్యేల బలం క్రమంగా 14కు చేరింది.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి తెలంగాణలో బతికి బట్టకట్టకుండా - గులాబీ అధినేత వేస్తోన్న ఎత్తుగడలకు కాంగ్రెస్ కుదేలవుతోంది. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికలల్లో వరుసగా పరాజయాల పరంపరను కొనసాగిస్తూ కాంగ్రెస్ క్రమంగా తెలంగాణలో చేజారిపోతోంది. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో డిపాజిట్ గల్లంతు కాగా నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఉన్న సీటును సైతం కాంగ్రెస్ చేజార్చుకుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికలల్లోనూ కాంగ్రెస్ కు చేదు అనుభవమే మిగిలింది. అధిష్టానం ప్రకటించిన కొంతమంది అభ్యర్థులు ఏకంగా బీఫామ్ తీసుకున్నాక టీఆర్ ఎస్ లోకి జంప్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఇక జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఉన్న పరువు పోగా....కరీంనగర్ - వరంగల్ - అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖాతాలోని మరో స్థానాన్ని కోల్పోయి, అపజయాల బాటలో పయనిస్తూనే ఉంది.
పాలేరు గెలుపుతో రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు ఎదురే లేకుండా పోయిందనేది కాదనలేని నిజం. ఈ ఓటమితో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఖాతాలో మరో చేదు అనుభవమే మిగిలింది. త్వరలోనే పార్టీ నేతలతో మాట్లాడి ఫలితాలను విశ్లేషించుకుంటామని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన నేపథ్యంలో మేడమ్ కు ఏం సమాధానం చెప్పాలా అని ఆ పార్టీ ముఖ్య నేతలను తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం అయినప్పటికీ ఓట్ల రూపంలో అది ప్రతిబింబించడం లేదనే అభిప్రాయాన్ని సోనియాగాంధీతో విన్నవించాలని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.