తెలంగాణ రాష్ట్రంలోని మంత్రుల్లో మాంచి హుషారుతో పాటు.. గడిచిన ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ తో ట్రావెల్ అవుతూ.. మొదటి రోజున ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నారో.. నేటికి అదే బంధాన్ని కంటిన్యూ చేస్తున్న ఏకైక మంత్రిగా తలసానికి పేరుంది.
కేసీఆర్ తో కలిసి నడవటం.. ఆయన మనసును ఎప్పుడూ ఒకేలా దోచుకోవటం అంత సులువైన విషయం కాదు. దానికి ప్రత్యేకమైన టాలెంట్ అవసరం. ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారో ఏ మాత్రం అర్థం కాని రీతిలో ఉండే ఆయన మూడ్ స్వింగ్స్ ను తట్టుకొని.. సమర్థుడిగా నిలవటం తలసానికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.
అలాంటి ఆయన తాజాగాఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. ఇందులో పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ పంచాయితీ ఏమిటన్న దానిపై అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మిగిలిన నేతలకు తలసానికి మధ్య తేడా ఏమిటంటే.. తాను ఎవరికైనా మద్దతు ఇస్తే.. వారి విషయంలో వంద శాతం అన్నట్లుగా ఉంటారు. వినిపించేది పిడి వాదన అయినప్పటికీ వెనుకా ముందు చూసుకోకుండా వినిపించే విలక్షణత ఆయన సొంతం.
చినజీయర్ స్వామి దగ్గర పంచాయితీ ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. పంచాయితీ ఏమీ లేదని.. చినజీయర్ స్వామి చేస్తున్నది చాలా గొప్ప ప్రోగ్రాంగా అభివర్ణించారు. మసాలాలు కావాలనే మీడియాలో ఏవో కథనాలు అల్లారన్నారు. సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు రామానుజాచార్యులు వద్దకు సమానత్వానికి అర్థం తెలియని పార్టీకి చెందిన ప్రధాని మోడీ పోవటమా? అని ప్రశ్నించిన ాయన.. దేశాన్ని మత ప్రాతిపదికన బీజేపీ విభజించి పాలిస్తోందన్నారు.
ఆరోగ్య రీత్యానో.. ఏదో కారణంతోనో సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. ప్రధాని మోడీని ఆహ్వానించటానికి ఒక మంత్రిని కూడా కేసీఆర్ పంపారు. ఎనిమిదేళ్లుగా ఎంత మొత్తుకుంటున్నా తెలంగాణ కోసం కేంద్రం చేసిందేమీ లేదన్న ఆయన.. అలాంటి వారిని గౌరవించేదేంటి? అని ప్రశ్నించారు. తలసాని వాదనే నిజమనుకుంటే.. కరోనా రెండో వేవ్ సందర్భంగా ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ పై సీఎం కేసీఆర్ రియాక్టు అయ్యిందేంటి? అన్న ప్రశ్న రాక మానదు.
మోడీ దేశ ప్రధాని అని.. ఆయన్ను ఇష్టం వచ్చినట్లుగా అంటుంటే తాము ఊరుకోమని.. అదే పనిగా విమర్శలు చేస్తూ.. ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేయాలని విలేకరుల సమావేశంలోనే రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ మాటల్ని మంత్రి తలసాని మిస్ అయినట్లున్నారు? ఎంతైనా తమ బాస్ మూడ్ కు తగ్గట్లు వ్యవహరించే తలసాని లాంటి వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం.