గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందుతులని శుక్రవారం తెల్లవారుజామున కేసు రీ కన్ స్ర్టక్చన్ కోసం బాధితురాలిని హత్య చేసిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాలికి చెందిన వస్తువులను అక్కడ పెట్టామని ఇక్కడ పెట్టామంటూ తిప్పారని చెప్పారు. ఆ తర్వాత అక్కడ నిందితులు పాతిపెట్టిన బాధితురాలికి సంబంధించిన సెల్ ఫోన్ - పవర్ బ్యాంక్ - వాచీని పోలీసులు గుర్తించారు. అయితే, ఆ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి రాళ్లు - కర్రలతో దాడి చేసి - పోలీసుల నుండి తుపాకీని ప్రధాన నిందితుడు ఆరిఫ్ లాగేసుకొని ..ఫైర్ స్టార్ట్ చేయడం తో పోలీసులు ఫైర్ చేయడంతో ఆ నలుగురు నింధితులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇక పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై పెద్దయెత్తున హర్షం వ్యక్తం అవుతున్న నేపధ్యంలో నగరానికి చెందిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇది కేసీఆర్ ఉగ్రరూపం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని అన్నారు. నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దిశ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్న వారే నేడు ఆయనకు జేజేలు కొడుతున్నారని - సంక్షేమ పథకాలే కాదు మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రధమస్థానంలో నిలిచిందని మంత్రి తలసాని అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని... కేసీఆర్ ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారని తలసాని చెప్పారు.