అఫ్ఘానిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న వెంటనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు తాలిబన్లు. శాంతిని నెలకొల్పడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పి కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద మహిళ చిన్నారిపై దాడి చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాలిబన్ ఫైటర్లు పదునైన ఆయుధాలతో మహిళలు, చిన్నారులపై దాడి చేస్తున్నట్లుగా సమాచారం.
ఎయిర్ పోర్ట్ నుంచి దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా చేసి ఉండొచచ్చని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు నుంచి తిరిగి రావాలంటూ కాల్పులు జరిపి బెదిరించినట్లుగా వీడియోలో ఉంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అందులో ఒక మహిళ, చిన్నారి కూడా ఉంది. తాలిబన్లు కాబూల్ లో పర్యటిస్తూ , మాజీ ప్రభుత్వ ఉద్యోగులపై కాల్పులు జరుపుతున్నారని ఫాక్స్ న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియా చెప్తుంది.
తక్ఖార్ ప్రాంతంలో ఓ మహిళ తలపై ముసుగు ధరించలేదని కాల్చి చంపేశారు. మరో మీడియా అయిన సీఎన్ఎన్ ప్రకారం, జూలై నెలలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఫైటర్లలో ఒకరు తలుపు కొట్టి 15మందికి వంట చేయాలని చెప్పారట. తాము పేదవారిమని అంతమందికి వంటచేయలేనంటూ చెప్పడంతో ఏకే-47 రైఫిల్స్ తో దారుణంగా కొట్టారు. ఇంటి పక్కనే గ్రైనేడ్ పేల్చి వెళ్లిపోయారు. గత వారం తాలిబాన్ల చేతిలో దాదాపు వెయ్యి మంది చనిపోయినట్లు యునైటెడ్ నేషన్స్ చెప్తుంది. ఆగష్టు 1నాటికి 4వేల 42మంది గాయపడ్డట్లు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వెల్లడించింది. అఫ్ఘన్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నంత కాలం తాలిబాన్ల మరింత హింసాత్మకంగా వ్యవహరించారు.
రెండు దశాబ్దాల తరువాత మళ్లీ తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్నారు. అమెరికా తమ సేనలను వెనక్కి రప్పించే ప్రక్రియ మొదలుపెట్టడంతో తాలిబన్ల పని సులువైంది. అయితే ఉగ్రవాద సంస్థ అయిన తాలిబన్ గ్రూప్ ఓ దేశాన్ని కబళించేంత బలంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో పది అత్యధిక సంపద గల ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో నిలిచారు. ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల ఆదాయంతో ఐసిస్ తొలి స్థానంలో ఉంది. నాలుగు మిలియన్ డాలర్లతో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నారు.
వీరికి ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కిడ్నాప్‌లు, సానుభూతిపరుల నుంచి నిధులు, విరాళాలే వస్తాయని ఫోర్బ్స్ పేర్కొంది. 2019-20లో తాలిబన్ల బడ్జెట్ 1.6 బిలియన్ డాలర్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.అక్రమ గనుల ద్వారా 464 మిలియన్ డాలర్లు, మాదకద్రవ్యాల రవాణా ద్వారా 416 మిలియన్ డాలర్లు, విదేశీ విరాళాల ద్వారా 240 మిలియన్ డాలర్లు, ఎగుమతుల ద్వారా 240 మిలియన్ డాలర్లు, పన్నుల ద్వారా 160 మిలియన్ డాలర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా 80 మిలియన్ డాలర్లు తాలిబన్లకు వచ్చినట్టు సమాచారం. ఇక ఆఫ్ఘన్‌లోని ఖనిజ నిక్షేపాలైన ఇనుము, మార్బుల్, రాగి, జింక్‌తోపాటు ఇతర అరుదైన లోహాలు ఉండటం తాలిబన్లకు వరంలా మారింది. ఇక్కడ ఏటా బిలియన్ డాలర్ల మైనింగ్ వ్యాపారం జరుగుతుంది. వీటి ద్వారా తాలిబన్లకు వందల మిలియన్ డాలర్లు వస్తాయి.
తమకు పట్టున్న ప్రాంతంలోని కంపెనీల నుంచి బలవంతంగా సొమ్మును వసూలు చేస్తారు తాలిబన్లు. తాలిబన్లకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సహా పలు దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. తాలిబన్లకు 2008లో విదేశాల నుంచి 106 మిలియన్ డాలర్లు అందినట్లు సీఐఏ నివేదిక తెలిపింది. వీటిల్లో గల్ఫ్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా, ఇరాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియాల నుంచి ఆర్థిక మద్దుతు అందుతోంది. ఈ స్థాయిలో ఆర్థిక వనరులు ఉండటంతో.. ఓ దేశాన్ని తమ హస్తగతం చేసుకునేంత బలంగా ఉన్నారు తాలిబన్లు.