తాలిబ‌న్ల నోట‌.. శాంతి మాట‌.. ఆశ్చ‌ర్యంగా ఉన్న నిజం

Update: 2022-02-25 17:34 GMT
దెయ్యాలు వేదాలు వ‌ల్లించ‌డం అంటే తెలుసా?  ర‌క్త పిపాసులకు జాలి ఉంటుందంటే న‌మ్ముతారా?  కానీ.. ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. తెల్ల‌వారి లేస్తే.. శ‌వాల మ‌ధ్య న‌డిచే క‌ర‌డు గ‌ట్టిన తాలిబ‌న్లు.. ఇప్పుడు శాంతి ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లె వేస్తున్నారు. అయితే.. ఇది మంచికే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో తాలిబ‌న్లు స్పందించారు. అయితే.. వీరు శాంతి మంత్రం ప్ర‌వ‌చించ‌డం గ‌మ‌నార్హం. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు పాల్పడిన క్రమంలో కీలక ప్రకటన చేశారు తాలిబన్లు. రెండు పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు.

అలాగే.. హింసాత్మక ఘటనలు పెంచే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరిం చుకోవాలన్నారు.  ట్విట్టర్‌ వేదికగా తాలిబ‌న్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించా లని సూచించారు.

అలాగే.. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్దం పరిష్కారం కాదని.. ఈ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. అనంతరం ఉక్రెయిన్‌లో ఉన్న ఆప్ఘనిస్తాన్‌ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ప్ర‌పంచ దేశాల ఆంక్ష‌లు

ఉక్రెయిన్పై బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. ఆ దేశ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా కీలక నేతలపై చర్యలకు ఉపక్రమించారు ప్రపంచ నేతలు.

పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులు ఫ్రీజ్ చేయాలని ఈయూ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. తీవ్రమైన ఆంక్షలకు జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు సిద్ధమయ్యాయి. రష్యా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. మాస్కోపై తీవ్రమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు.
Tags:    

Similar News