త‌మిళ‌నాడు సీఎం ఔదార్యం.. రాష్ట్రంలో అంద‌రికీ వైద్యం..!

Update: 2021-12-19 08:53 GMT
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్ర‌జ‌ల కోసమే తాను ఉన్నాన‌ని.. చెప్ప‌డ‌మే కాకుండా.. త‌న చ‌ర్య‌ల్లోనూదీనిని నిరూపిస్తున్నారు. ఇటీవ‌ల చెన్నైలో వ‌ర‌ద‌లు వ‌స్తే.. త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. త‌నే స్వ‌యంగా సిటీ బ‌స్సుల్లోకి ఎక్కి.. ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా డౌన్ టు ఎర్త్ అనే మాట‌ను ఆయ‌న నిజం చేస్తున్నారు. త‌న‌ను పొగిడేవారికి ఆయ‌న చెక్ పెడుతున్నారు. ప్ర‌జ‌ల‌కు 24/7 సీఎంవో కార్యాల‌యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఇలా.. ప్ర‌జ‌ల సీఎంగా స్టాలిన్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఒక స‌రికొత్త ప‌థ‌కాన్ని ఆయ న ప్రారంభించారు. కేవ‌లం త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కే కాకుండా రాష్ట్రేతరుల‌కు కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు స్టాలిన్ నిర్ణ‌యించారు. దీంతోఈ ప‌థ‌కంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతు న్నాయి. అది కూడా ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ కావ‌డం గ‌మ‌నార్హం. రోడ్డు ప్ర‌మాదాలు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయి. ఎప్పుడు ఎక్క‌డ ఎవ‌రు ఎలాంటి ప‌రిస్థితిలో రోడ్డు ప్ర‌మాదాల‌కు గురి అవుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి . ఇలాంటి సంద‌ర్భాల్లో.. గాయ‌ప‌డిన వారిని ర‌క్షించేందుకు ‘నమ్మై కాక్కుం 48’ (48 గంటల్లో ప్రాణాలు కాపాడుదాం) పథకాన్ని తమిళనాడులో ప్ర‌వేశ పెట్టారు.

ఈ ప‌థ‌కాన్ని సీఎం స్టాలిన్ శనివారం ప్రారంభించారు. రోడ్డు ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ వారికి త‌క్ష‌ణం సాయం అందించ‌డ‌మే కీల‌కం. ఎందుకంటే వెంట‌నే వైద్యం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క్ష‌త‌గాత్రుల‌కు ప్ర‌మాదానికి గురైన వెంట‌నే 48 గంట‌ల పాటు అందించే చికిత్స‌కు ఉచిత వైద్యం అందించేందుకు నిర్ణ‌యించింది. అంతేకాదు.. ఈ ప‌థ‌కం కింద కేవ‌లం త‌మిళ‌నాడు వాసుల‌కే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా అర్హులేన‌ని సీఎం స్టాలిన్ చెప్పారు.

దీంతో త‌మిళ‌నాడులో ప్ర‌మాదానికి గురైన వారు వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం కింద ఉచితంగా 48 గంట‌ల పాటు ఎలాంటి ఖ‌ర్చులు లేకుండా ఉచితంగా వైద్యం పొందే అవ‌కాశం ఉంది. నిజానికి ఇలాంటి ప‌థ‌కం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఉచిత వైద్యం అందిస్తున్న‌ప్ప‌టికీ.. ఇలా క్ష‌త్ర‌గాత్రుల‌కు.. ప్రాధ‌మిక వైద్యం అందించి.. వారి వారి రాష్ట్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. లేదా బాధితులే ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స‌లు పొందుతున్నారు. కానీ, తొలిసారి త‌మిళ‌నాడులో ఇలా ఆప‌న్న హ‌స్తం అందించే ప‌థ‌కం రావ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News