ఆ రాష్ట్రంలో కాలేజీల‌కు నో సెల్ ఫోన్స్!

Update: 2018-08-20 06:05 GMT
హ‌స్త భూష‌ణంగా మారిన సెల్ ఫోన్ లేకుండా క్ష‌ణం కూడా గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాడులోని ప‌ళ‌ని స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇక‌పై.. కాలేజీల్లోకి సెల్ ఫోన్ల‌ను అనుమ‌తించేది లేద‌న్న విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం పలువురిని షాక్ కు గురి చేస్తోంది.

మారిన ప‌రిస్థితుల్లో సెల్ ఫోన్ నిత్య‌వ‌స‌రంగా మారింది. పిల్ల‌లు ఇంటి నుంచి వెళుతున్న‌ప్పుడు.. ఏదైనా అవ‌స‌రం అయితే.. వెంట‌నే కాంట్రాక్ట్ చేసేందుకు సెల్ కు మించిన ఉత్త‌మ మార్గం మ‌రొక‌టి ఉండ‌దు. అంతేనా.. క్యాబ్ తో పాటు.. మ‌రిన్ని స‌దుపాయాలు సెల్ తోనే సాధ్యం.

మ‌రీ విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారో లేదో కానీ.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు సెల్ ఫోన్లు త‌మ వెంట తీసుకురాకూడ‌ద‌న్న ఆదేశాల్ని జారీ చేసింది. కేంద్రం నేతృత్వంలో నిర్వ‌హించే ఐఐటీల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చారు. ప‌ళ‌ని స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై త‌మిళులు మండిప‌డుతున్నారు. ఓప‌క్క డిజిట‌ల్ అంటూనే.. మ‌రోవైపు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

విద్యార్థుల మండిపాటు నేప‌థ్యంలో ప‌ళ‌నిస‌ర్కార్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుందా?  కొన‌సాగిస్తుందా?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News