దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో మహమ్మారి కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సరైన ప్రణాళికలు అమలు చేస్తున్నా కూడా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు సరికదా ...రోజు రోజు కి భారీగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర , ఢిల్లీ , తమిళనాడు రాష్ట్రాల్లో రోజు వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి.
తమిళనాడులో ఇప్పటి వరకు 67వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. జిల్లాల పరిధిలో రాకపోకలపై ఆంక్షలు విధించింది. జిల్లాల సరిహద్దులు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను సైతం జిల్లా దాటి వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తునట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్ళాలి అంటే తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలని, పాస్ ఉన్నవాళ్లకు మాత్రమే జిల్లా దాటే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. జూన్ 30 వ తేదీ వరకు ఈ నిబంధనలు కఠినం గా అమలు చేస్తునట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని చోట్ల పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.