తేల్చుకోవటం అంటే ఇలా ఉండాలి.. స్టాలిన్ సంచలనం

Update: 2022-05-27 04:35 GMT
ఇంట్లో కూర్చొని ఎవడైనా మాట్లాడతాడు. కానీ.. నలుగురి మధ్యలో మాట్లాడటం ఒక ఎత్తు. అలా మాట్లాడి అందరి మనసుల్ని దోచుకోవటం మరో ఎత్తు. అన్నింటికి మించి మన మాటలతో అందరికి ఏకం చేయటం ఇంకో ఎత్తు. విధాన పరంగా తాను వ్యతిరేకించే వారితో నేరుగా మాట్లాడటం ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగకున్నా.. చెప్పాల్సింది సూటిగా చెప్పేసినట్లు అవుతుంది. తాజాగా అలాంటి పనే చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.

కేంద్రంలోని మోడీ సర్కారు బీజేపీయేతర రాష్ట్రాల్ని పట్టించుకోవటం లేదన్న విమర్శ అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. దానికి సరికొత్త సొల్యూషన్ ను చూపించారు తమిళనాడు ముఖ్యమంత్రి. తమ రాష్ట్రం ఎదుర్కొంటున్ సమస్యల్ని ప్రధాని మోడీ ఎదుటే చెప్పేసిన ఆయన.. ఆ క్రమంలో మర్యాదను మిస్ కాకుండా ప్రధాని మోడీకి సరికొత్త అనుభవాన్ని మిగిల్చారు. ప్రధాని మోడీ ముందే సంచలన వ్యాఖ్యలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆయన తీరుకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.

దేశాన్ని మార్చేస్తానని చెప్పే మోడీకి.. ఆయన ముందు.. ఆయన ముఖం మీదనే.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామని చెప్పటం మామూలు విషయం కాదన్నది మర్చిపోకూడదు. అలాంటి సాహసం చేసిన ఆయన ఇప్పుడు సంచలనంగా మారారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిన ప్రధాని మోడీ.. రాష్ట్ర సీఎం స్టాలిన్ తో కలిపి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.31వేల కోట్లతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇలా చేసినప్పుడు రాష్ట్రానికి కేంద్రం చాలా చేసిందన్న భావన కలుగక మానదు. అయితే.. చేయాల్సింది చాలానే ఉందన్న విషయాన్ని తేల్చి చెప్పిన స్టాలిన్.. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి.

ప్రధాని మోడీ సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. పలు డిమాండ్లను ఆయన ముందుంచారు. అవన్నీ కూడా దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్నవే. అయితే.. ఈ డిమాండ్లు మొత్తం మోడీకి చికాకు కలిగించేవే కావటం విశేషం. ఇంతకూ ఆయన పెట్టిన డిమాండ్లను చూస్తే..

-  హిందీని కాకుండా తమిళ భాషను అధికారిక భాషగా గుర్తించాలి.
-  జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలి.
-  మేం నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టాం.
-  హిందీలాగే మద్రాస్‌ హైకోర్టులో తమిళ్‌ను అధికార భాషగా మార్చాలి.
-  మ‌త్స్య‌కారులు స్వేచ్ఛ‌గా చేప‌లు ప‌ట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి క‌చ్చ‌తీవు ద్వీపాన్ని తిరిగి పొందాలి.
-  త‌మిళ‌నాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధుల‌ను విడుద‌ల చేయాలి.
Tags:    

Similar News