ఉత్తర ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఘోర ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడగా - 70 మంది సాధారణ గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స్ అందిస్తున్నారు. బొలొగ్నాలోని ఓ బ్రిడ్జిపై పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ఓ ట్రక్కు....కార్లను తీసుకువెళుతున్న లారీ ఢీకొట్టడంతో ఈ భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఆకాశంలో ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. ఈ భారీ పేలుడు ధాటికి బ్రిడ్జిలో కొంత భాగం ధ్వంసమయింది. బ్రిడ్జి శకలాలు కింద ఉన్న కారు పార్కింగ్ లోని కార్లపై పడడంతో మంటలు అక్కడకూ వ్యాపించాయి.
దాంతోపాటు , పేలుళ్ల ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పగిలిన అద్దాలు మనుషులపైకి దూసుకురావడంతో మరికొంతమంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, చుట్టుపక్కల నివసించే ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అయితే, లారీ ...ట్యాంకర్ ఢీకొన్న తర్వాత భారీ పేలుడు సంభవించడానికి కొద్దిగా సమయం పట్టింది. దీంతో ఘటనా స్థలం చుట్టు పక్కల ఉన్న కార్లు - వ్యాన్లు ఇతర వాహనాలు వెనక్కు వెళ్లిపోయాయి. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదని సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బంది తెలిపారు.