సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా కొందరి ఇమేజ్ ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు తారా చౌదరి. కొన్నేళ్ల క్రితం తారా చౌదరి ఉదంతం తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేయటమే కాదు.. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు భారీ కలకలాన్నే రేపాయి. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె.. అప్పుడప్పుడు వార్తల్లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో ఆమెకు సంబంధించిన ఎలాంటి న్యూస్ రాలేదు. ఇలాంటి వేళ.. వార్తల్లోకి వచ్చారు తారా చౌదరి. గతంలో హైదరాబాద్ లో ఉన్న ఆమె.. ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లాలో తన భర్తతో కలిసి ఉన్నారు.
ఇంట్లోకి అవసరమైన నిత్యవసర వస్తువులు.. తన ఐదు నెలల బిడ్డకు మందులు తీసుకొచ్చేందుకు బయటకు వచ్చిన తన భర్త రాజ్ కుమార్ ను పామూరు ఎస్ఐ అకారణంగా కొట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తన భర్తపై ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
నాటుసారా తరలిస్తున్నట్లుగా కేసులు క్రియేట్ చేస్తున్నారని.. మద్యం సేవించకున్నా తాగినట్లుగా బ్రీతింగ్ టెస్టు సీన్ క్రియేట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ వేళ తాను ఎదుర్కొంటున్న సమస్యలు.. ప్రజలకు ఎదురవుతున్న కష్టాల్ని అధికారుల వరకూ తీసుకెళ్లటమే తన భర్త చేసిన తప్పుగా ఆమె అభివర్ణిస్తున్నారు. తన భర్తను టార్గెట్ చేసిన పామూరు ఎస్ఐ.. బయటకు వచ్చిన సందర్భాన్ని అసరాగా చేసుకొని తప్పుడు కేసులు నమోదు చేశారని.. తమను వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.