గొంతులో కత్తి దిగేసినా భారత మాతాకీ జై అనను- ఎంఐఎం నాయకుడు - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలివి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యల్నిఖండిస్తుంటే లౌకికవాద మంత్రం జపిస్తున్న కొందరు యథావిధిగా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఓ ముస్లిం ప్రముఖురాలి ద్వారా ఓవైసీ షాకింగ్ లాంటి కామెంట్లు వచ్చాయి. ముస్లిం మతంలోని తప్పుడు విధానాలను ఎండగట్టడంలో, మతం ఆధారంగా చేసే పనులను నిలదీయడంలో ముందుండే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ ఓవైసీపై మండిపడ్డారు.
ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆమె ట్విట్టర్ వేదికగా ఖండించారు. భారతదేశంలో ప్రజాప్రతినిధిగా ఎంపికైన వ్యక్తి రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నస్రీన్ వ్యాఖ్యానించారు. ఒవైసీ వంటి వ్యక్తులను ప్రజల ముందు నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు. ఓవైసీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ...రాజ్యసభలో నిన్న జావేద్ అక్తర్ చేసిన ప్రసంగం కదిలించిందని ఆమె పేర్కొన్నారు. ఇపుడు లౌకిక వాదులు నస్రీన్ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.