టాటా నెక్సాన్ ఈవీలో మంటలు.. టాటా దర్యాప్తు

Update: 2022-06-23 16:35 GMT

ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడం చూశాం. కానీ ఇప్పుడు మొదటిసారి ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగిన ఘటన నమోదైంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ముంబైలో జరిగింది.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జూన్ 22న ముంబైలో ఓ టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన టాటా నెక్సాన్ ఈవీలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి. దీంతో ఇప్పుడు ఇది మాట్ టాపిక్ గా మారింది.

ప్రమాదం జరగడానికి భద్రతా లోపమే కారణమా? లేక యాక్సిడెంటల్ గా ఈ ప్రమాదం జరిగిందా? అనే విషయంపై  పోలీసులు మరియు కంపెనీ దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకావం ఉంది.

భారత్ లో అత్యదికంగా అమ్ముడవుతున్న నెంబర్ 1 ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ. కంపెనీ ఇటీవలే ఇందులో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను కూడా విడుదల చేసింది. పెర్ఫామెన్స్, రేంజ్, చార్జింగ్ టైం , ప్రాక్టికాలటీ వంటి అంశాలలో ఇది దిబెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా  ఉంది. ఫీచర్లు, సరసమైన ధర కారణంగా ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ కారు సేఫ్టి రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ ను కూడా కలిగి ఉంది.

టాటా మోటార్స్ ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లను విక్రయిస్తోంది. ముంబైలో కాలిపోయిన ఘటనలో టాటా, నెక్సాన్  ఈవీ యొక్క భద్రతా అంశాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదాలు ఇప్పుడు ఈవీల సేఫ్టీపై ప్రశ్నలు లేవనెత్తాయి.

ముంబైలోని వసాయ్ వెస్ట్ లో జరిగిన ఈ ప్రమాదంలో సదురు కారు యజమాని తన కార్యాలయంలో ఈవీని చార్జ్ చేసి ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు. కారులో క్రింది భాగంలో అమర్చిన బ్యాటరీ ప్యాక్ నుంచి పొగరావడం గమనించారు. కొద్దిసేపటికే వాహనంలో మంటలు చెలరేగడంతో బ్యాటరీలోని సెల్ లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం ప్రారంభమయ్యాయి. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. కాగా టాటానెక్సాన్ లో మంటలపై టాటా కంపెనీ ఆరాతీసింది. దీనిపై పరిశోధన ప్రారంభించింది. లోపాలు సరిద్దుద్దాతామని ప్రకటించింది.


Tags:    

Similar News