ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులపై ‘ఖాళీ స్థలాల పన్ను’ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) పడబోతోంది. ఎప్పుడో పడాల్సిన ఈ పన్ను పలు కారణాలతో జాప్యమైంది. ప్లాట్లు కనిపిస్తున్నప్పటికీ.. యజమానులు ఎవరో.. వారి చిరునామా ఏంటో తెలియక ఇంతకాలం ఖాళీ స్థలాలపై పన్నులు విధించలేకపోయింది సర్కారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల నుంచి ప్లాటు విస్తీర్ణంతో సహా.. యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందాయి. గతేడాది ఆగస్ట్ 31న ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇప్పుడు వీటన్నిటికీ పన్ను వేసేందుకు పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు సిద్ధమవుతున్నాయి.
ఈ ప్లాట్లు, లే–ఔట్లు మొత్తం సమీప భవిష్యత్‌లో ‘వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్’ పరిధిలోకి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వీటిపై సంబంధిత పురపాలికలు, గ్రామ పంచాయతీలు పన్నులు విధించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికోసం ఎల్‌ఆర్‌ఎస్–2020 డేటా బేస్‌ను త్వరలో ఆయా పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందజేయనుందని సమాచారం. ఈ వివరాల ఆధారంగా ఖాళీ స్థలాలపై విధించే పన్నును స్థానిక పురపాలికలు/గ్రామ పంచాయతీలు దరఖాస్తుదారుల చిరునామాకు డిమాండ్ నోటీసుల రూపంలో పంపించే అవకాశముంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయేతర ఆస్తులపై ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, పన్నేతర చార్జీల వసూళ్లను 100 శాతం వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఆదాయం పొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు అందిస్తున్న సేవలకు అనుగుణంగా పన్నులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఉండిపోయిన గృహాలు, ఖాళీ స్థలాల నుంచి పన్నులు వసూలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక, ధరణి పోర్టల్ లో నమోదు చేసేందుకు అంటూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో ఆస్తి పన్నుల పరిధిలోకి రాని 1,09,735 గృహాలను పురపాలకశాఖ గుర్తించింది. వీటిపై తక్షణమే ఆస్తి పన్ను విధించాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టినప్పుడు సైతం దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా స్థానిక పురపాలికలు ప్లాట్లపై పన్ను విధించాయి. అనుమతి లేకుండా/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై.. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా జరిమానాల రూపంలో వసూలు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు చెబుతున్నాయి.
అయితే.. అక్రమ కట్టడాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద లేక గతంలో జరిమానాలు విధించలేకపోయారు. బీఆర్‌ఎస్–2015 కింద అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందులో ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండటంతో.. ఆ సమాచారం ఆధారంగా ఆయా కట్టడాలపై జరిమానాలను విధించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆ ప్రకారమే.. ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లోని సమాచారం తీసుకొని పన్నులు వేసేందుకు సిద్దమవుతున్నాయి స్థానిక పురపాలక సంస్థలు.