జ‌గ‌న్ వ‌ల్లే నిధులు రాలేద‌ట టీడీపీ కామెడీ!

Update: 2020-02-01 16:30 GMT
ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ లో మొండి చేయి చూప‌డంపై తెలుగుదేశం పార్టీ విడ్డూరంగా స్పందించింది. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగితే... విమ‌ర్శించాల్సింది ఎవ‌రిని? ఈ మాత్రం కామ‌న్ సెన్స్ ఎవ‌రికైనా ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ లెక్క‌లో మాత్రం జ‌నాల‌కు ఆ మాత్రం తెలివి తేట‌లు ఉండ‌వు. అందుకే కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న రోజున కూడా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ప‌నికి దిగింది తెలుగుదేశం పార్టీ.

రాష్ట్ర ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల‌నే  కేంద్రం నిధులు ఇవ్వ‌లేద‌ట! ఇదీ తెలుగుదేశం పార్టీ కామెంట్. రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను ఏర్ప‌రుస్తుండ‌టంతో కేంద్రం ఏపీకి నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేద‌ని తెలుగుదేశం పార్టీ అంటుండ‌టం గ‌మ‌నార్హం. మూడు రాజ‌ధానుల‌కూ కేంద్ర బ‌డ్జెట్ కు సంబంధం ఏమిటో తెలుగుదేశం పార్టీకే తెలియాలి.

అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తూ ఉండి ఉంటే.. కేంద్రం నిధులు ఇచ్చేద‌ట‌. అమ‌రావ‌తికి నిధులు వ‌ద్ద‌ని జ‌గ‌న్ అన్నార‌ట‌. ప్ర‌ధాన‌మంత్రికి అలా చెప్పార‌ట‌. అందుకే ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ లో నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేద‌ట‌. ఇది తెలుగుదేశం పార్టీ భాష్యం. కేంద్ర బ‌డ్జెట్ లో నిధుల కేటాయింపు లేక‌పోవ‌డం పై తెలుగుదేశం పార్టీ ఇలా అమ‌రావ‌తి, అమూడు రాజ‌ధానులు అంటూ మాట్లాడుతూ.. తాము రోజూ చేసే ఆరోప‌ణ‌ల‌న్నింటినీ గుప్పించింది.

కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగి ఉంటే.. ఆ విష‌యాల గురించి మాట్లాడాల్సింది పోయి.. తెలుగుదేశం పార్టీ.. త‌న రొటీన్ ఆరోప‌ణ‌ల‌నే గుప్పించి రోజువారి విమ‌ర్శ‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన‌ట్టుగా ఉంది. కేంద్ర బ‌డ్జెట్ ను ఒక సాకుగా వాడుకుని జ‌గ‌న్ పై విరుచుకుప‌డుతూ.. తెలుగుదేశం పార్టీ త‌న రొటీన్ డైలీ వ‌ర్క్ ను పూర్తి చేసింది.
Tags:    

Similar News