రాజకీయ పార్టీలు నాయకులు తాత్కాలికం. రాష్ట్రం శాశ్వతం. ఎందరో రాష్ట్రాన్ని పాలించారు. ఇంకా పాలిస్తారు. అలా నేతలు వస్తూంటారు, పార్టీలు కూడా పుడుతూంటాయి, గిడుతూంటాయి. రాష్ట్రం మాత్రం అలాగే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలు అని పిలుపు ఇస్తున్నారు.
లాజిక్ కి అందని ఈ పిలుపుని చూసి అంతా విస్తుపోతున్నారు. ఏ విధంగా ఏపీకి లాస్ట్ చాన్స్ బాబు గారూ అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఏపీకి 2024 ఎన్నికలు చిట్టచివరివా. మరి ఆ మీదట 2029 ఎన్నికలు రావా అని అడుగుతున్నారు. కాలంతో పాటుగా రాష్ట్రం కూడా అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్నో ఎన్నికలను చూస్తుంది అని మేధావులు సైతం అంటున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు కావచ్చేమో. ఆయన ఏడు పదులు దాటి ఉన్నారు. అలాగే టీడీపీకి కూడా అయితే గియితే 2024 ఎన్నికలు లాస్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో టీడీపీ కనుక అధికారంలోకి రాకపోతే కచ్చితంగా టీడీపీ ఇబ్బందిలో పడుతుంది. అది ఆ పార్టీ రాజకీయ సమస్య. పూర్తిగా సొంత వ్యవహారం.
ఆ సంగతి బాబు కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. అందుకే ఆయన కర్నూల్ సభలో తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ తనను గెలిపించి అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని ప్రజలకు కోరుకున్నారు. అయితే అది బూమరాంగ్ అయింది. వైసీపీ నుంచి గట్టి అటాక్ వచ్చింది. బాబుకు కచ్చితంగా 2024 చివరి ఎన్నికలే అంటూ వారు పొలిటికల్ ర్యాగింగ్ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీలో కూడా దాని మీద చర్చ సాగింది. సీనియర్ నేతలు కూడా బాబు అలా చివరి ఎన్నికలు అనడం తప్పు అన్నట్లుగా చర్చించుకున్నారు. మరి ఎవరి సలహాలు బాబు మీద పనిచేశాయో ఏమో కానీ గోదావరి జిల్లాల టూర్ కి వచ్చేసరికి బాబు లాస్ట్ చాన్స్ అన్న దానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు లాస్ట్ చాన్స్ కాదు రాష్ట్రానికి అంటూ కొత్త అర్ధం చెప్పుకొచ్చారు.
అయితే ఇది మరీ కామెడీగా ఉందని ఇపుడు కామెంట్స్ పడుతున్నాయి. రాష్ట్రానికి లాస్ట్ చాన్స్ ఏమి ఉంటుంది అని బాబుకే రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు అంతా. ఏపీ ఏ ఒక్క రాజకీయ పార్టీకో కట్టుబడి లేదు. నాడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి మొదలుపెడితే ఎన్నో పార్టీలను చూసింది మరెన్నో పార్టీలను చూస్తుంది. అలాగే తొట్ట తొలి సీఎం నీలం సంజీవ రెండ్డి నుంచి ఈ రోజున ఉన్న జగన్ దాకా అందరి పాలన చూసింది.
ఎవరి పరిపాలన అయినా నచ్చక పోతే వారిని కుర్చీ నుంచి దించేసి మాజీని చేయగల సత్తా రాష్ట్రానికి ఉంది. అంతే కాదు, రాజకీయ పార్టీలను ఆదరించి అందలం అప్పగించగలదు, అలాగే తమకు వద్దు అనుకుంటే చరిత్ర పుటలలో కలిపేయగలదు. అలాంటి ఆంధ్రాకు లాస్ట్ చాన్స్ అన్నది ఎపుడూ ఉండదు అనే అంటున్నారు.
అందువల్ల బాబు లాస్ట్ చాన్స్ నినాదం మరోసారి బూమరాంగ్ అవుతోంది అంటున్నారు. ఈ విధంగా జనాలకు లాస్ట్ చాన్స్ అంటూ చెప్పి ఎమోషనల్ పాలిటిక్స్ చేసేబదులు తమకు ఎందుకు ఓటు వేయాలో సరిగ్గా చెప్పి ఓట్లు రాబట్టుకుంటే దర్జాగా టీడీపీ అధికారంలోకి వస్తుంది కదా అన్న సూచనలు కూడా వస్తున్నాయి. డొంక తిరుగుడు గా సెంటిమెంట్ ని రాజేసి ఆఖరు ఎన్నికలు చివరి చాన్సులు అంటూ జనాలను బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా వారి చైతన్యానికి పరీక్ష పెట్టాలని చూసినా మొదటికే మోసం అవుతుంది అన్నదే బాబు లాంటి రాజకీయ అనుభవం ఉన్న వారు గ్రహించాలని సూచనలు అందుతున్నాయి. మరి బాబు గారు లాస్ట్ చాన్స్ అన్న రొడ్డ కొట్టుడు స్లోగన్ ని విడిచిపెడతారా లేక అదే బాగుందని ముందుకు సాగిపోతారా అనేది చూడాల్సి ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.