రాజంపేట టీడీపీ అభ్యర్థి ఆయనే

Update: 2019-02-01 09:04 GMT
కడప జిల్లా టీడీపీకి ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ మొదటినుంచి కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ వాళ్లంతా వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో.. జగన్‌ని దెబ్బ కొట్టాలంటే ఆయన సొంతం జిల్లా నుంచి మొదలుపెట్టాలని భావించిన చంద్రబాబు గత ఎన్నికల్లో గట్టిగానే పోరాడారు. అయితే.. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమ గెలిచారు. అదే రాజంపేట. సో.. గట్టిగా ప్రయత్నిస్తే.. పోటీ ఇవ్వడమే కాదు గెలుపు కూడా సొంతం చేసుకోవచ్చని ఫిక్స్ అయిన చంద్రబాబు అప్పటినుంచి కడప జిల్లాపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టాడు. ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నికల వేళ రాజంపేట ఎమ్మెల్యే కాస్తా వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో.. రాజంపేట స్థానంలో మళ్లీ టీడీపీజెండా ఎగరాలని భావించిన చంద్రబాబు సరైన అభ్యర్థి కోసం రెండు రోజుల పాటు జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో.. అక్కడ టీడీపీకి ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేడు. దీంతో.. ఈ ఎమ్మెల్యే సీటుపై ఇప్పుడు అదే జిల్లాకు చెందిన నాయకులు పోటీపడ్డారు. ఈ లిస్ట్‌ లో ప్రముఖ ఎన్నారై, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, రెడ్‌ బస్‌ సహ వ్యవస్థాపకుడు చరణ్‌, మాజీ ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడు ఉన్నారు. దీంతో… చంద్రబాబు చెంగల్రాయుడు వైపే మొగ్గు చూపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో సతీష్‌ వేమన ప్రకటించారు. చెంగల్రాయుడు విజయం కోసం తామంతా కలిసి పనిచేస్తామని చెప్పారు.

సతీష్‌ వేమకు ఎన్నారై లోకల్ కాదు అలానే ఇక చరణ్‌ సంగతి కూడా అంతే. అదే చెంగల్రాయుడుకి సీటు ఇస్తే..ఆయన లోకల్‌. గతంలో ఓడిపోయాడు కాబట్టి సానుభూతి ఉంటుంది. అటోమేటిగ్గా నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి. అదీగాక.. పార్టీని నమ్మిుకుని ఉన్నాడు. ఇలాంటప్పుడు కూడా సీట్‌ ఇవ్వకపోతే ఈ సందర్భాన్ని విపక్షం క్యాష్‌ చేసుకుంటుంది. అందుకే.. సతీష్‌ వేమన, చరణ్‌ని పక్కనుపెట్టి. చెంగల్రాయిడికే సీట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు.
Tags:    

Similar News