చంద్రబాబు ఫోన్ కాల్స్ ను ఆ ప్రాంతం వాళ్లు బ్లాక్ చేశారా?

Update: 2020-08-13 06:30 GMT
చంద్రబాబు ఫోన్ కాల్స్ ను ఆ ప్రాంతం వాళ్లు బ్లాక్ చేశారా?
  • whatsapp icon
తెలుగు రాజకీయాల్లో అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబే.. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తిమ్మిని బిమ్మిని చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అనుకుంటున్నారు..

తెలుగుదేశం విజయాల్లో ఉత్తరాంధ్ర పాత్ర ఎంతో కీలకమైనది.. టీడీపీకి బూత్ స్థాయిలో పట్టున్న ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే ఎందుకు వద్దు అన్నాడని అక్కడ మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. విశాఖ అర్బన్ నాలుగు సీట్లు ఉంటే నాలుగు కూడా టీడీపీ గెలుచుకుంది. అలాంటి పట్టున్న టీడీపీ ఏరియాలో ఈరోజు పట్టు కోల్పోతోంది.

సరే ఉత్తరాంధ్రలో..  రాయలసీమ వలే కుల సమీకరణాల ప్రకారం వర్క్ అవుట్ కావడం కష్టమే. అందుకే ఉత్తరాంధ్రలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ పెట్టిద్దాం అని చంద్రబాబు ఆలోచించాడట.. ఈ మేరకు చంద్రబాబు ఫోన్ చేయగా.. చాలా మంది మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు బాబు ఫోన్ కాల్స్ బ్లాక్ చేసినట్టు తెలిసింది.. కొందరి ఫోన్ లు అయితే పనిచేయడం లేదు అని వస్తున్నాయట..  

ఇలా విశాఖను రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర నేతలంతా దూరంగా జరుగుతున్నారు. అక్కడి ప్రజల్లోనూ టీడీపీ అధినేతపై వ్యతిరేక భావం ఏర్పడుతోంది. బలమైన ప్రాంతాన్ని చంద్రబాబు చేజేతులారా వదులుకుంటున్నాడన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
 


Tags:    

Similar News