తెలంగాణలో ఇప్పటికే చాపచుట్టేసిన టీడీపీ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. జిల్లాల్లో కనుమరుగైనా ఆంధ్రా ప్రాబల్యమున్న హైదరాబాద్ లో మాత్రం టీడీపీ ఉనికి కాస్త ఉంది. ఆ ఉనికితోనే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలుచుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్టే గ్రేటర్ బరిలో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఏకంగా గురువారం 90మందితో తొలి జాబితాను ప్రకటించి ఆశ్చర్యపరిచింది. బలంగా ఉన్న బీజేపీనే ఇప్పటిదాకా రెండు విడతల్లో కేవలం 39మందిరి మాత్రమే ప్రకటిస్తే టీడీపీ ఏకంగా 100 కు దగ్గర అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశాయి. 26మందిని ప్రకటించాయి.
ఇక కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 27 డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.