బద్వేల్ ఉప ఎన్నిక ఇపుడు తెలుగుదేశానికి బాగా కలసి వచ్చినట్లుంది. అక్కడ పోటీ చేయమంటూ వ్యూహాత్మకంగా తప్పుకుని బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వన్ సైడ్ లవ్ ని తమ్ముళ్ళు స్టార్ట్ చేశారు అంటున్నారు. నిజానికి రాయలసీమ ప్రాంతాల్లో కమలానికి ఎంత బలం ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీకి బద్వేల్ లో చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లు కనిపిస్తున్నారు. వారు కూడా టీడీపీ నుంచే ఉంటున్నారు. మరి ఇది తెర వెనక స్నేహమా లేక ముందర రోజుల కోసం బంధమా అన్నది తెలియడంలేదు. మొత్తానికి టీడీపీ తప్పుకోవడం, బీజేపీ ఎంట్రీ ఇవ్వడం ఒక వ్యూహం ప్రకారమే సాగింది అన్నది బద్వేల్ లో పోలింగ్ వద్ద సంఘటనలు చూస్తే అర్ధమవుతుంది.
మరో వైపు బద్వేల్ లో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే వార్ ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక్కడే టీడీపీ అతి తెలివి కూడా కనిపిస్తోంది. తాము బీజేపీకి మిత్రులం కాబట్టే పోటీలో లేమని సందేశం ఇచ్చుకున్నట్లుగా కూడా దీన్ని చూడాలి అంటున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేశారు అని టీడీపీ వర్గాలు చెప్పుకున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బీజేపీకి టీడీపీ అవసరం ఉందని స్పష్టమవుతోంది. దానికి తగినట్లుగా బద్వేల్ లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు దక్కేలా చూస్తే కనుక తెర వెనక టీడీపీ వ్యూహం ఉందని అర్ధం అవుతుంది.
ఇక బీజేపీకి ఆ మాత్రం ఏపీలో లేపినా కేంద్ర నాయకత్వం నుంచి బాగానే మార్కులు పడతాయి. అది కూడా రాయలసీమలో జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లాలో ఒక ఉప ఎన్నికలో బీజేపీకి బాగా ఓట్ల షేర్ వస్తే కచ్చితంగా టీడీపీకే ప్లస్ అవుతుంది. ఆ మీదట బీజేపీ కేంద్ర పెద్దలు కూడా మెత్తబడతారు, ఫ్యూచర్ పాలిటిక్స్ ని కూడా ఈ లెక్కలతో సమీక్షించుకుంటారు. మొత్తానికి కొత్త పొత్తులకు, ఎత్తులకు ఇది ప్రాతిపదిక అవుతుంది.
అందుకే బద్వేల్ లో తమకు బలమున్న చోట్ల టీడీపీ బీజేపీకి బాహాటంగానే సహకరిస్తోంది. ఒక విధంగా బీజేపీ గెలవకపోయినా వైసీపీ మెజారిటీని గణనీయంగా తగ్గించాలని చూస్తోంది. దీని వల్ల రెండిందాలా లాభం. ఏపీలో వైసీపీ మీద మోజూ క్రేజూ బాగా తగ్గాయని చెప్పడం అన్న మాట. ఏకంగా జగన్ సొంత జిల్లాలోనే ఫ్యాన్ స్పీడ్ తగ్గింది అని చెప్పడం ద్వారా టీడీపీ గణనీయంగా లాభపడే చాన్స్ ఉంది. అదే టైం లో బీజేపీతో చెలిమికి దారులు ఏర్పడతాయి. మొత్తానికి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా టీడీపీ వేస్తున్న ఎత్తులు బద్వేల్ బంధాన్ని పటిష్టం చేసేలాగానే ఉన్నాయని అంటున్నారు.