ఎటకారానికి ఒక హద్దు ఉంటుంది. కానీ.. ఆ హద్దుల్ని అధికారమదం దాటేసేలా చేస్తుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారంటూ నెల్లూరు తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో మీడియా దృష్టిని ఆకర్షించే ఆనం తాజాగా మోతాదు మించిన వ్యంగ్యంతో ఏపీ విపక్షానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై చౌకబారుతనంతో వ్యంగ్యంగా మాట్లాడారన్నమాట వినిపిస్తోంది.
ఆనం మాటలే కాదు.. హావభావాలు సైతం.. మహిళల్ని అవమానించేలా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తేడాలుంటే.. ఇష్యూల వారీగా తప్పుపట్టటం సమంజసం. అందుకు భిన్నంగా రోజాను అవమానించటమే లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు ఏ మాత్రం సరికావన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజాను ఉద్దేశించి తాజాగా మాట్లాడిన ఆనం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నోరు లేని తనపై రోజా కేసు వేసిందన్నారు. ‘‘ఆ రోజమ్మ తల్లి.. నా మీద కేసు వేసిందయ్యా.. ఆ మహాతల్లి పసి పిల్లోడినైనా నా మీద కేసు వేసిందయ్యా. నేను ఆమెను ఏమన్నాను. ఆమెకు ఏమైనా డ్రామాలుంటే..యాక్టింగ్ చేయాలనుకుంటే టీవీలో చేసుకో. జనం ముందు చేయొద్దు’’ అంటూ చిత్ర విచిత్రమైన హావభావాలతో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆనం తీరు ఏమాత్రం హుందాగా లేదన్న వాదన వినిపిస్తోంది. అంత ఎత్తున ఉండే ఆనం పసిపిల్లోడైతే.. పసిపిల్లల పరిస్థితేంటి ఆనం?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/