నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయాన బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో పార్టీ లో చేరారు.
హైదరాబాద్ లోని జగన్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో కేతిరెడ్డి రామకోటారెడ్డి పార్టీలో చేరిన వైనం నెల్లూరు రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. తాను.. తన అనుచరులు జగన్ పార్టీలోకి చేరాలని భావిస్తున్నామని.. ఇందుకు జగన్ సమక్షంలో పార్టీ కండువా వేసుకోవాలన్న అభిప్రాయానికి తగ్గట్లే..రామకోటా రెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీలో చేశారు.
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. కావలి రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా.. సాగునీటి సంఘం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం పెద్ద దెబ్బగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా పార్టీలోకి చేరిన రామకోటారెడ్డి తన అనుచరులతో పాటు.. తన ఇద్దరు కుమారులు (శశిధర్ రెడ్డి.. కళాధర్ రెడ్డి) కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం అభినందనీయమని.. ఆయన ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తనకున్న నమ్మకం తన ఒక్కడిది మాత్రమే కాదని... ప్రజలందరి నమ్మకంగా ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ తో బాబు జత కట్టటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన రామకోటారెడ్డి.. ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకే బాబు ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు.మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న మంత్రి సోమిరెడ్డి.. తన సొంత బావను పార్టీ మారకుండా చేయలేకపోయారని.. ఇది ఆయన వైఫల్యంగా చెబుతున్నారు.
Full View