తెలంగాణలో జరుగుతున్న పార్టీ చేరికల్లో కొత్త కోణం తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు - మాజీ నేతలు ఇప్పటివరకు ఈ చేరికల్లో ఉండగా తాజాగా సినీ నటుల పేరు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా ఉన్న సినీనటి కవిత టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమయినట్లుగా తాజాగా ఆమె వ్యాఖ్యలను బట్టి పలువురు విశ్లేషిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. చిన్న సినిమాలను ఆదుకునేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు. థియేటర్లలో 5వ షోగా చిన్న సినిమాను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల గురించి చర్చించారు. తెలుగుదేశం పార్టీకి తాను ఎంతో సేవచేసినప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదన్నారు. పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం - ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం వంటి అనేక కార్యక్రమాలు సొంతంగా నెత్తికెత్తుకున్నప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు. టీఆర్ ఎస్ చేరుతున్నారా అని మీడియా ప్రశ్నించగా కవిత ఖండించకపోగా పై విధంగా వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగించింది. దీంతో ఆమె పార్టీ మారనున్నారంటూ ఉహాగానాలు వెలువడుతున్నాయి.